రంగస్థలం సినిమా తరువాత రామ్ చరణ్ రేంజ్ అమాంతం పెరిగి పోయింది. ఈసారి బోయపాటి దర్శకత్వంలో వినయ విధేయ రామ చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాని రూపొందించాడు. ఈసారి సంక్రాంతి నాదే అంటూ చరణ్ వస్తున్నాడు. ఇదే సంక్రాంతికి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్, వెంకటేష్, వరుణ్ తేజ్ ఎఫ్2 సినిమాలు భరిలో ఉన్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ సినిప్రస్థానం, రాజకీయ జీవిత ఆధారంగా రూపొందింది. ఇకా వెంకటేష్, వరుణ్ తేజ్ ల ఎఫ్2 పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుంది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్నది రామ్ చరణ్ వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకులు ఎదికోరుకుంటారో అది కచ్చితంగా ఈ సినిమాలో ఉంటుందని బోయపాటి ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ రోజే చెప్పేశాడు.
ఈ మూడు కూడాడిఫరెంట్ జోనర్లకు సంబందించిన సినిమాలు కావునా ఈ మూడింటికి మంచి వసూళ్ళు వచ్చే అవకశాలు ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎక్కువగా ఇష్టపడుతారు కావున ఈ మూడింటిలో చరణ్ సినిమా ఎక్కువ థియేటర్స్ లో విడుదల చెయ్యడానికి ఎగ్జిబిటర్లు ఇంటరెస్ట్ చూపుతున్నారంట. మొత్తానికి చరణ్ పై రంగస్థలం సినిమా ఎఫెక్ట్ భాగా పడుతుందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినపడుతుంది. చరణ్ సరసన కియర అద్వాని కథానాయకగా నటిస్తుంది. కీలక పాత్రలో ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ నటిస్తున్నారు.ప్రతినాయకుడి పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నాడు, దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తుంది. జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా వినయ విధేయ రామ చిత్రం విడుదలవుతుంది.