దాసరి నిజంగానే లైపో చేయించుకున్నారా?

fake news about dhasari Narayana Lipo treatement

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దర్శకరత్న దాసరి నారాయణ రావు చనిపోయిన తర్వాత మీడియాలో వస్తున్న కథనాలు, కొందరు వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యల కారణంగా ఆయన ఆత్మ క్షోభిస్తు ఉంటుంది. ఆయనపై లేని పోని వార్తలు రాయడం, ఆయన గురించి ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయడం చేస్తున్నారు. తాజాగా దాసరి నారాయణ రావు అమెరికాలో 20 రోజులు ఉండి లైపో చికిత్స చేయించుకున్నారు అంటూ సినీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. తనకు దాసరి చాలా సన్నిహితుడని, ఆయన లైపో విషయం తనకు మాత్రమే తెలుసు అంటున్నాడు. 

దాసరి లైపో చేయించుకున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన కుటుంబ సభ్యులు మరియు ఆయనకు ఆప్తులు అయిన వారు చెబుతున్నారు. దాసరికి లైపో చేయించుకోవాల్సిన అవసరం ఏంటని, కాస్త లావు ఎక్కువ ఉన్న మాట వాస్తవమే కాని, ఆయన తన బరువు వల్ల ఎప్పుడు ఇబ్బంది పడలేదని, బరువు కంట్రోల్‌లో ఉంచుకునేందుకు ప్రతి రోజు వ్యాయామం చేసేవారు అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయన చనిపోయిన తర్వాత పబ్లిసిటీ కోసం, ఇంకా దేనికో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదు అని ఆయన అభిమానులు అంటున్నారు.

మరిన్ని వార్తలు