శ్రీరెడ్డిని అడ్డుకునేందుకు రంగంలోకి పెద్దలు

Famous-actor-and-director-s

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌ను ప్రస్తుతం శ్రీరెడ్డి వణికిస్తోంది. వరుసగా స్టార్స్‌పై సంచలన ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డి తీరుపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాట సుచిలీక్స్‌ తరహాలో శ్రీరెడ్డి లీక్స్‌ మీడియాలో వస్తున్న నేపథ్యంలో రంగంలోకి కొందరు సినీ పెద్దలు దిగారు. వరుసగా శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను కట్టడి చేసేందుకు ఒక ప్రముఖ నటుడు మరియు దర్శకుడు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. శ్రీరెడ్డికి జరిగిన అన్యాయం గురించి వారు తెలుసుకోవాలని, ఆమెకు న్యాయం చేసి ఇకపై ఆమె నుండి ఎలాంటి లీక్‌లు రాకుండా జాగ్రత్త పడాలని వారు భావిస్తున్నారు.

ఇటీవలే శ్రీరెడ్డి నుండి శేఖర్‌ కమ్ముల, శ్రీరామ చంద్ర, నానిల లీక్‌లు వచ్చాయి. వారు ప్రస్తుతం తల పట్టుకున్నారు. శ్రీరెడ్డి సోషల్‌ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మీడియాలో కూడా ఆమె పలువురు స్టార్స్‌పై చేస్తున్న వ్యాఖ్యలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఏబీఎన్‌లో శ్రీరెడ్డి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ ఇంటర్వ్యూలో గతంతో పోల్చితే కాస్త తక్కువగానే ఇండస్ట్రీపై ఆరోపణలు చేసింది. పెద్దల రాయభారం శ్రీరెడ్డిపై పని చేస్తుందని, ఇకపై శ్రీరెడ్డి కాస్త సైలెంట్‌గా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.