త‌మ హీరో సినిమా హిట్ కావాల‌ని మోకాళ్ళ‌తో తిరుమ‌ల మెట్లెక్కిన ఫ్యాన్

fan climbing all the way upto tirumala on knees

సినిమా సెల‌బ్రిటీలు ఎల్ల‌ప్పుడు అభిమానుల‌కి హెచ్చ‌రిక‌లు చేస్తూనే ఉంటారు. అభిమానం అనేది హ‌ద్దులు దాటొద్ద‌ని, మితిమీరిన అభిమానంతో ప్రాణాల మీద‌కి తెచ్చుకోవ‌ద్ద‌ని వారు వార్నింగ్స్ ఇస్తూనే ఉంటారు. అయిన‌ప్ప‌టికి కొంద‌రు డైహ‌ర్డ్ ఫ్యాన్స్ త‌మ హీరో ప్ర‌శంస‌లు పొందాల‌ని రిస్క్‌లు చేస్తుంటారు. తాజాగా రామ్ అభిమాని ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ కావాల‌ని మోకాళ్ళ‌తో తిరుమ‌ల మెట్లెక్కాడు. ఈ వీడియో రామ్ కంట ప‌డ‌డంతో ఆయ‌న భావోద్వేగంతో స్పందించారు. డియ‌ర్ సందీప్‌.. నీ ప్రేమ నా హృద‌యాన్ని తాకింది. ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావ‌ని అనుకుంటున్నాను. మీరు నాపై ఇంత ప్రేమ చూపించ‌డానికి నేను ఏం చేశానో అర్ధం కావ‌డం లేదు. మీలాంటి వారంద‌రి కోసం నా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. మీలాంటి అభిమానులు నాకు దొర‌క‌డం నా అదృష్టం అని రామ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ఛార్మి కూడా ఆ వీడియోపై స్పందించింది . నువ్వు నన్ను ఏడిపించావు సందీప్‌..నీకు కృత‌జ్ఞ‌త‌లు ఒక్క‌టి చెబితే స‌రిపోదు. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ కావాల‌ని తిరుమ‌ల మెట్లు మోకాలితో ఎక్కావు. మాపై ఎంతో ప్రేమ‌, అనురాగం చూపించావు అని ట్వీట్ చేసింది ఛార్మి. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం జూలై 18న విడుద‌ల కానుండ‌గా ఈ చిత్రం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే.