వర్మపై ఉన్న గౌరవం పోయింది

fans comments on ram gopal varma

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకుని తన వైవిధ్యభరిత స్పందన తెలియజేస్తూ, అందరి దృష్టిని ఆకర్షిస్తూ వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా మరోసారి వివాదాస్పదుడు అయ్యాడు. ఎన్ని వివాదాస్పద కామెంట్స్‌ చేసినా కూడా ఆయనపై సినిమా పరిశ్రమలో ఆయన అంటే ఎక్కువ మందికి గౌరవం ఉంది. తెలుగులో ఎన్నో అద్బుత చిత్రాలు తీయడంతో పాటు, సౌత్‌ నుండి వెళ్లి ఉత్తరాదిన స్టార్‌ హీరోలకు పెద్ద దిక్కుగా నిలిచి చిత్రాలు చేసిన దర్శకుడిగా తెలుగు వారు ఆయన్ను అభిమానిస్తారు. ఎవరేం అనుకున్నా కూడా తాను అనుకున్నది చెప్పడంలో, చేయడంలో ముందు ఉండే వర్మ ఆమద్య పోర్న్‌ మూవీ తీసి కూడా కొందరి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆయన ఎంతగా చెత్త కామెంట్స్‌ చేసినా కూడా ఆయనపై ఎక్కువ మందికి గౌరవం ఉంది. కాని తాజాగా ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకుని పవన్‌పై కక్ష సాధించాలని చూడటంతో ఆయన పరువు పోయింది.

ఇప్పటి వరకు రామ్‌ గోపాల్‌ వర్మ గారు అంటూ సంభోదిస్తూ, గౌరవిస్తూ వచ్చిన వారు కూడా ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక అమ్మాయితో పవన్‌పై బూతు మాటలు చేయించడం ఎంత మాత్రం సమజసం కాదని, అది ఆయన స్థాయిని దిగజార్చే విధంగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాను కావాలనే శ్రీరెడ్డితో అలా మాట్లాడిచ్చాను అంటూ వర్మ చెప్పడం ఇక్కడ కొసమెరుపుగా భావించవచ్చు. పవన్‌ కళ్యాణ్‌కు పదే పదే సారీ చెప్పినా కూడా వర్మ చేసిన తప్పును స్వయంగా ఆయన అభిమానులు క్షమించడం లేదు. వర్మ తన స్థాయిని ఈ సంఘటనతో పూర్తిగా దిగజార్చుకున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.