Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మరియు ఫస్ట్‌లుక్‌లు సినిమాపై అంచనాలును ఆకాశానికి తీసుకు వెళ్లాయి. ‘పెళ్లి చూపులు’ చిత్రంలో చాలా కూల్‌గా కనిపించిన విజయ్ ఈ చిత్రంలో మాత్రం చాలా వైల్డ్‌గా నటించినట్లుగా ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సమయంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం మీడియా ముందుకు వచ్చింది.
‘అర్జున్ రెడ్డి’ చిత్ర కథ దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు అటు ఇటు తిరుగిందట. అంటే ఎంతో మంది నిర్మాతలు మరియు హీరోలు కూడా ఈ కథపై నమ్మకం చూపించలేదట. చివరకు శర్వానంద్ ఈ సినిమాను చేసేందుకు ముందుకు రావడం జరిగింది. సినిమాను నిర్మించేందుకు శర్వానంద్ సన్నిహితుడు కూడా ముందుకు వచ్చాడు. కాని ఏదో కారణాల వల్ల ‘అర్జున్ రెడ్డి’ని శర్వానంద్ పక్కకు పెట్టాడు. దాంతో మళ్లీ కథ అటు ఇటుగా తిరిగి చివరికి విజయ్ వద్దకు చేరింది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాను శర్వానంద్ మిస్ అయ్యాడు అనే టాక్ వినిపస్తుంది. శర్వానంద్ చేస్తే సినిమా స్థాయి మరోలా ఉండేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.
మరిన్ని వార్తలు: