సీబీఐ లంచాల కేసులో మోడీ హస్తం…!

Few-Crores-Was-Paid-To-Mini

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సీబీఐలో విబేధాల ప‌ర్వం ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌క‌ముందే మ‌రో అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఈ సారి నేరుగా ఈ ఆరోప‌ణ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ న‌మ్మిన‌బంటు మెడ‌కు చుట్టుకుంది. సీబీఐలో రెండో స్థానంలో ఉన్న రాకేస్ ఆస్థానా అవినీతి వ్యవహారంపై దర్యాప్తుచేస్తున్న మనీష్ కుమార్ సిన్హా అనే సీబీఐ అధికారి సుప్రీంకోర్టులో సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్లడించారు. ‘‘ఒక వ్యాపారవేత్తను కేసులోంచి తప్పించేందుకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్తీభాయ్ చౌధురి కొన్ని కోట్లు లంచంగా తీసుకున్నారు’’ అంటూ ఆయ‌న కోర్టుకు అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు. గత నెలలో సీబీఐలో ఇద్దరు సీనియర్ అధికారుల మధ్య వివాదం సందర్భంగా కొంతమంది అధికారులను మూకమ్మడిగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. మంత్రి లంచం తీసుకున్నట్టుగా తన వద్ద ఆధారాలు ఉన్నాయని సిన్హా కోర్టుకు వివరించాడు.

cbi
రాకేష్ ఆస్థానా అవినీతి ఆరోపణలపై విచారణను తప్పించేందుకే తనను బదిలీ చేశారని సిన్హా తెలిపాడు. నా వద్దనున్న ఆధారాలు చూస్తే మీరు షాక్ అవుతారని సిన్హా న్యాయవాది పేర్కొనగా ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ స్పందిస్తూ మాకేమీ షాక్ కాదు అంటూ సిన్హా పిటీషన్‌ని తక్షణం విచారించేందుకు నిరాకరించారు. సిన్హా జాతీయ భద్రత సంస్థ సలహాదారు అజిత్ దోవల్‌పై మరికోన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆస్థానాపై అవినీతి ఆరోపణలపై విచారణను అజిత్ దోవల్ జోక్యం చేసుకున్నారని సోదాలను కూడా నిలుపుదల చేయించారని కోర్టుకు సిన్హా వివరించారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సానా సతీష్ బాబు మంత్రికి లంచం ఇచ్చినట్టుగా తనకు చెప్పాడని సిన్హా కోర్టుకు చెప్పారు. అక్టోబర్ 20 మధ్యాహ్నం సీబీఐ డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర కుమార్ కార్యాలయం, నివాసాల్లో తను సోదాలు చేపట్టినట్టు సిన్హా చెప్పారు. ఆ సమయంలో ఆయనకు సీబీఐ డైరెక్టర్ నుంచి ఫోన్ వచ్చింది.

modi

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సూచనల మేరకు సోదాలు నిలిపేయాల్సిందిగా సీబీఐ డైరెక్టర్ తనను ఆదేశించారన్నారు. ఇంతకు ముందు 15 అక్టోబర్ న ఆస్థానాపై అవినీతి ఆరోపణలతో ఎఫ్ఐఆర్ దాఖలైంది. 17 అక్టోబర్ న సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ దోవల్‌ గురించి చెప్పారు. అదే రాత్రి దోవల్‌తో ఆస్థానా మాట్లాడారని. తనను అరెస్ట్ చేయనీయకుండా కాపాడాలని ఆస్థానా విజ్ఞప్తి చేశారని తన దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఆస్థానా మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని సోదా చేయాలని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ఏకే బస్సీ భావించారు. దీనికి సంబంధించి దోవల్‌ అనుమతి లేదని సీబీఐ చీఫ్ అలోక్‌ వర్మ తనను వెంటనే అడ్డుకొన్నారని సిన్హా చెప్పారు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)అధికారి సామంత్ గోయల్ తో భేటీపై నిఘాను కూడా ఎత్తేయించారని సిన్హా తన పిటిషన్ లో తెలిపారు. సీబీఐ కేసుని పీఎంవో పర్యవేక్షిస్తుందని తనకు తెలిసినట్టు చెప్పారు. అదే రోజు రాత్రి ఆస్థానా కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ టీమ్ అంతటినీ తొలగించారని వివరించారు. కాగా ఈ పిటిష‌న్ మంగ‌ళ‌వారం విచార‌ణ‌కు రానుంది.

manish