Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బిగ్‌బాస్ సీజన్ 2 నిన్నటి నుండి స్టార్ మాటీవీలో ప్రసారం అవుతుంది. మొదటి రోజు అంతా కూడా పార్టిసిపెంట్స్ పరిచయం మరియు బిగ్‌బాస్ ఇల్లు పరిచయం జరిగింది. ఇప్పుడు బిగ్‌బాస్ అసలైన కథ ప్రారంభం కాబోతుంది. మొదటి సీజన్లో అంతా కూడా సెలబ్రెటీలు మాత్రమే ఉండే వారు. కాని ఇప్పుడు మొత్తం 16 మందిలో ముగ్గురు సామాన్యులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు వారి మొహాలను ఎప్పుడు చూసింది లేదు. అయినా కూడా వారు సెలబ్రెటీలకు ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తామంటూ నమ్మకంగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రేక్షకులు కాస్త నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
బిగ్‌బాస్‌లో గుర్తింపు ఉన్న సెలబ్రెటీలు కేవలం గీతామాధురి, తేజస్వి, శ్యామల మాత్రమే అని మిగిలిన వారు ఎవరో తెలియదంటూ విమర్శలు చేస్తున్నారు. సెలబ్రెటీలను కాకుండా సోసో పార్టిసిపెంట్స్‌ను ఎంపిక చేయడం పట్ల ప్రేక్షకులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం షోలో సామాన్యులు మరియు సెలబ్రెటీలు ఉన్నారు కనుక ఖచ్చితంగా ఆసక్తికరంగా సాగుతుందని, ఎలాంటి నిరాశ పడనవసరం లేదు అంటూ చెబుతున్నారు. మొదటి వారం, రెండవ వారం తర్వాత వారే సెలబ్రెటీలు అవుతారని, ప్రేక్షకులు అలవాటు చేసుకుంటారు అంటూ స్టార్ మా వాళ్లు కూడా నమ్మకంగా ఉన్నారు. మొత్తానికి బిగ్‌బాస్ సీజన్ 2 మొదటి సీజన్‌తో పోల్చితే కాస్త తక్కువ ఆసక్తికర అంశాలతో మొదలైంది. కాని ముందు ముందు ఏదైనా జరగవచ్చు అంటూ నాని హింట్ ఇస్తున్నాడు కనుక ఖచ్చితంగా ఆసక్తికరంగా బిగ్‌బాస్ సీజన్ 2ను నాని నడిపిస్తాడని, ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.