Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత రెండు నెలలుగా తెలుగు ప్రేక్షకులు అంతా కూడా కేవలం రెండు సినిమాలతోనే ఎంటర్‌టైన్ అవుతున్నారు. ఆ రెండు సినిమాలతో పాటు మరో ఇరవై సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కాని ఆ రెండు సినిమాలు తప్ప మరే సినిమాలు కూడా నిలవలేక పోతున్నాయి. ఆ రెండు సినిమాలే ఫిదా, అర్జున్ రెడ్డి. వరుణ్ తేజ్ నటించిన ఫిదా చిత్రం విడుదలై రెండు నెలలు అవుతుంది. సాయి పల్లవి యాక్టింగ్‌తో, శేఖర్ కమ్ముల టేకింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేసి, రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి, ఓవర్సీస్‌లో టాప్ జాబితాలో చోటు సంపాదించింది.
ఇక విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో అడల్డ్ కంటెంట్ ఎక్కువ అయినా కూడా మరో సినిమా లేక పోవడంతో జనాలు అర్జున్ రెడ్డికే క్యూలు కడుతున్నారు. సగటున తెలుగు ప్రేక్షకుడు సినిమా చూడాలి అంటే గత నెల రోజులుగా చూస్తే అర్జున్ రెడ్డి లేదా ఫిదా చిత్రాలను మాత్రమే చూస్తున్నట్లుగా కలెక్షన్స్‌ను బట్టి అర్థం అవుతుంది. ప్రతి వారం ఇతర సినిమాలు రావడం వెళ్లి పోవడం జరుగుతుంది. ఒక్క సినిమా అయిన మంచి కలెక్షన్స్‌ను తీసుకు రాలేక పోయింది అంటే ఏ రేంజ్‌లో ఈ రెండు సినిమాలు ఇంకా ఆడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ రెండు సినిమాలే నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్‌ను నెట్టుకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రెండు సినిమాల కష్టాలు మరో రెండు రోజుల్లో తీరిపోనుంది. ఎన్టీఆర్ ‘జై లవకుశ’ చిత్రం వచ్చిన తర్వాత ఫిదా, అర్జున్ రెడ్డిలకు వెళ్లే దారులు మూసుకు పోనున్నాయి. దసరాకు మూడు సినిమాలు వస్తుండటంతో ఆ రెండు సినిమాలను చూసే బాధ ప్రేక్షకులకు తప్పిందని ట్రేడ్ వర్గాల వారు కామెడీగా అంటున్నారు.