Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి విశాఖ బయల్దేరిన ఏపీ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్యూట్ కారణంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ దగ్గర్లోని బిర్లా నగర్ రైల్వేస్టేషన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. G6, G7 ఏసీ కోచ్ ల్లో చెలరేగిన మంటలు… మరో నాలుగు బోగీలకు కూడా మంటలు వ్యాపించాయి. G6, G7 ఏసీ బోగీలు మాత్రం పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేడగంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే అగ్నిప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో 36 మంది ట్రైనీ IASలు ఉన్నట్లు సమాచారం. వీరంతా కూడా ఎలాంటి గాయాలు లేకుండా బయటకు వచ్చారు. ప్రస్తుతం మంటలను అదుపు చేస్తున్నారు. రైల్వే ఫైర్ సేఫ్టీ సిబ్బంది, ఫైర్ డిపార్ట్ మెంట్ టీమ్స్ బిర్లా నగర్ స్టేషన్ కు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.