Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశాన్ని ఇటు బీజేపీ అటు టీడీపీ పక్కనపెట్టినప్పటినుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రగిలిపోతూనే వున్నారు. ఓ దశలో ఆ రెండు పార్టీల మీద యుద్ధానికి సిద్ధం అయిపోయారు. కానీ హోదా కన్నా ప్యాకేజ్ మిన్న అని అధికార పార్టీలు ఎదురు దాడికి దిగడంతో దాన్ని ఎదుర్కోడానికి పవన్ గొంతుక సరిపోలేదు. అయినా అవకాశం వస్తే ఆ పార్టీల పని చెబుదామని మౌనంగా జనసేన సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టారు పవన్. ఇక ఆయనతో కలిసి నడిచేందుకు వామపక్షాలు, లోక్ సత్తా మాత్రమే కాదు విపక్ష వైసీపీ కూడా ఉవ్విళ్లూరింది. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సందిగ్ధ పరిస్థితి ఎదుర్కొన్నారు. రాజకీయంగా ఏ వైపు మొగ్గితే ఏ ఫలితం వస్తుందో అని భయపడిపోయారు. అందుకే రాజకీయంగా ఓ నిర్ణయం తీసుకోడానికి ప్రజాభిప్రాయమే ప్రాతిపదికగా భావించాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రజాభిప్రాయాన్ని ఒడిసి పట్టేందుకు ఫ్లాష్ సర్వే సంస్థతో ఓ సర్వే చేయించుకున్నారట.
మొత్తం 175 నియోజకవర్గాల్లో ఏక కాలంలో జరిపిన సర్వే లో వివిధ అంశాలపై ప్రశ్నలు సంధించారు. ఆ సర్వే ఫలితాలు , వెల్లడైన అభిప్రాయాల్లో బులెట్ పాయింట్స్ ఇవే …
- “ఫ్లాష్ సర్వే” 2017
- TDPకి 45శాతం ఓట్లు, 101 సీట్లు
- జనసేనకు 14శాతం ఓట్లు, 21 సీట్లు
- YSRCP 31శాతం ఓట్లు 40 సీట్లు
- కాంగ్రెస్ 4శాతం ఓట్లు 4 సీట్లు
- 6శాతం ఓట్లతో 9సీట్లలో బీజేపీ, లెఫ్ట్
- “ఫ్లాష్ సర్వే” కీ నోట్స్
- ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉన్నా ప్రత్యామ్నాయం లేదు
- వైసీపీ ప్రతిపక్షంగానే విఫలం అయిందని నిర్ణయానికి వచ్చిన జనం
- పవన్‌కళ్యాణ్ నిజాయితీ, కమిట్‌మెంట్ పట్ల ప్రజల్లో సదభిప్రాయం
- కాపు సామాజికవర్గం ముద్రగడను నమ్మటం లేదు
- రైతులు ప్రభుత్వాన్ని గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు
- మధ్యతరగతి, మహిళల్లో చంద్రబాబు బాగా కష్టపడుతున్నారనే అభిప్రాయం
- చంద్రబాబును కాదంటే మరి ఎవరికి వేయమంటారు జగన్‌కా అని వెటకారం
- జగన్ వస్తే ఈ మాత్రం కూడా మిగలనివ్వడని ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేసిన జనం
- పవన్‌కళ్యాన్, లోక్‌సత్తా, లెఫ్ట్ కలిస్తే ఓట్ల శాతం పెరిగే అవకాశం
- ఏపీ ఇంతలా డెవలెప్ అవుతుందని తాము ఊహించలేదన్న అత్యధికులు
- ప్రభుత్వం మీద వ్యతిరేకత తక్కువ శాతమే అది ఎం పెద్ద ప్రభావం ఉండదు
- ప్రభుత్వం అన్నాక కాస్తో కూస్తో వ్యతిరేకత ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న రాష్ట్రం పరిస్థితులు చూస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత స్వల్పంగా నే ఉంటుంది
ఫ్లాష్ సర్వే సారాన్ని అర్ధం చేసుకుని దాన్ని భగవద్గీతలా భావించిన పవన్ కళ్యాణ్ బీజేపీ తో సంబంధం లేని టీడీపీ తో రాజకీయ ప్రయాణం బాగానే ఉంటుందని ఓ నిర్ణయానికి వచ్చారట. ఆ నిర్ణయానికి వచ్చాకే ఉద్దానం బాధితుల అంశం మీద మాట్లాడడానికి అమరావతి వచ్చి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారట. వారి మధ్య ఏకాంత సమావేశంలో రాజకీయ ప్రయాణం మీద కూడా లోతైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
మరిన్ని వార్తలు: