వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా అరుదైన రికార్డు నెలకొల్పింది. బర్మింగ్‌హామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఇవాళ భారత్ తలపడుతోంది. బంగ్లాతో పోరులో బరిలో దిగిన ఇండియా టీమ్‌లో నలుగురు వికెట్ కీపర్, బ్యాట్స్మెన్లు ఉండటం విశేషం. అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో ఇలా ఒకే జట్టులో నలుగురు స్పెషలిస్ట్ వికెట్కీపర్లు తుదిజట్టులో ఉండటం అరుదైన విషయం. సీనియర్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ యథావిధిగా వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించనుండగా కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ ఫీల్డింగ్ చేయనున్నారు. మ్యాచ్‌లో ఒకరు గాయపడినా, విశ్రాంతి తీసుకోవాలన్నా ప్రత్యామ్నాయంగా మరో ముగ్గురు వికెట్ కీపర్లు అందుబాటులో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో విజయ్ శంకర్ స్థానంలో పంత్ జట్టులోకి రాగా.. కేదార్ జాదవ్ స్థానంలో దినేశ్ కార్తీక్ బంగ్లాతో మ్యాచ్‌లో చోటు దక్కించుకున్నాడు.