గులాబీ పని పడతానంటున్న గద్దర్

gaddar-fires-on-kcr

తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. ప్రజా యుద్ధనౌకగా పేరున్న గద్దర్ ఎన్నో పాపులర్ పాటలతో తెలంగాణ వాదాన్ని ప్రజల గుండెల్లో నాటుకుపోయేలా చెప్పగలిగారు. ఉద్యమ సమయంలో గద్దర్ ను అందరూపెద్దన్నగా గౌరవించారు. కేసీఆర్ కూడా చాలా మర్యాదిచ్చారు. కానీ తెలంగాణ వచ్చాక సీన్ మారిపోయింది.

2014 ఎన్నికల్లో గద్దర్ సపోర్ట్ కోసం పాకులాడిన పార్టీలే.. ఇప్పుడు ఆయన వెంటపడుతున్నా కాదంటున్నాయి. దీంతో చిర్రెత్తుకొచ్చిన గద్దర్.. 2019లో సత్తా చూపిస్తానంటున్నారు. టీఆర్ఎస్ పని పడతానని పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు సాధించుకున్నది భౌగోళిక తెలంగాణ మాత్రమేనని, అంతా కలలు కన్న తెలంగాణ ఇంకా సాకారం కాలేదని గద్దర్ హీటు పుట్టిస్తున్నారు.

గద్దర్ కు ప్రజాసంఘాల మద్దతుంది. ఆయన బరిలోకి దిగితే సైలంట్ మెజార్టీ జనం కూడా గద్దర్ కు ఓటేస్తారు. అందుకే గద్దర్ ప్రకటనపై పార్టీలు ఉలిక్కిపడుతున్నాయి. కానీ అప్పట్లో గద్దర్ కు ఉన్న క్రేజ్ ఇప్పుడు ఉందా అనేది డౌటే.గద్దర్ తో పాటు కేసీఆర్ వ్యతిరేకులు తోడైతే.. కాంగ్రెస్ వారిని చేరదీస్తుందనేది గులాబీ నేతల భయం.