Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నిషిత్ కన్నుమూసిన విషాదంలో వున్న మంత్రి నారాయణ ఇంట మళ్లీ నవ్వులు విరబూశాయి. నారాయణ కుమార్తె శరవని కి పండంటి మగబిడ్డ పుట్టాడు. ఈమె మరో మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ ని కిందటేడు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శరవని ఈ బిడ్డకి జన్మనిచ్చింది. విషయం తెలిసిన వెంటనే మంత్రులిద్దరూ ఆస్పత్రిలో వాలిపోయారు. మనవడిని ఎత్తుకుని మురిసిపోయారు. నారాయణ కుటుంబ సభ్యులైతే ఇటీవల చనిపోయిన నిషిత్ తిరిగి పుట్టినంత సంబరపడిపోతున్నారు.
నారాయణ కుమార్తె శరవని లండన్ లో ఎంబీఏ చేశారు. ఇక రవితేజ సింగపూర్ లో బీబీఎం, అమెరికా లో ఆపై చదువులు చదివారు. ఆ ఇద్దరికీ కిందటేడాది పెళ్లి చేశారు. ఆ వేడుకల్లో నారాయణ కుమారుడు నిషిత్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. గంటా కొడుకు రవి తేజ హీరోగా ఓ సినిమా చేశారు. జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో చేసిన జయదేవ్ సినిమా విడుదలకి రెడీ గా వుంది.