Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కరేబియన్ కబాలి డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ కు సుమారు రెండేళ్ల తరువాత వెస్టిండీస్ వన్డే జట్టులో చోటు దక్కింది. విండీస్ తరపున క్రిస్ గేల్ వన్డే ఆడి 29 నెలలు అయ్యింది. 2015 మార్చిలో గేల్ చివరిసారి వన్డే జట్టులో కనిపించాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఇంగ్లండ్ తో జరిగే వన్డే సిరీస్ కోసం గేల్ ను జట్టులోకి తీసుకున్నారు. గేల్ తో పాటు మార్లోన్ శామ్యూల్స్ కు విండీస్ వన్డే జట్టులో చోటు దక్కింది. 2016 అక్టోబర్ లో శామ్యూల్స్ చివరగా వన్డే ఆడాడు. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును విండీస్ ప్రకటించింది.
గేల్ మరియు శామ్యూల్స్ రాకతో వెస్టిండీస్ జట్టు బలం పెరిగింది. ఈ ఇద్దరి ఎంపిక జట్టుకు అదనపు బలాన్ని తీసుకొస్తుందని క్రికెట్ వెస్టిండీస్ సెలక్షన్ ప్యానల్ చైర్మన్ కర్టనీ బ్రౌన్ అభిప్రాయపడ్డారు. వీరిద్దరి అనుభవం యువ క్రికెటర్లకు లభిస్తుందని బ్రౌన్ పేర్కొన్నారు. అయితే ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో కు గాయం కారణంగా తుది జట్టులో చోటు దక్కలేదు. వచ్చే ఏడాది బ్రేవో పునరాగమనం చేసే అవకాశం ఉందన్నారు. గత కొంతకాలంగా విండీస్ క్రికెటర్లకు బోర్డుకు మధ్య కాంట్రాక్ట్ ఫీజుల విషయంలో తీవ్రస్థాయిలో వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో్నే కొంతమంది విండీస్ సినియర్ క్రికెటర్లు జట్టుకు దూరమవుతూ వచ్చారు. అయితే ఈ వివాదం కొంతవరకూ పరిష్కారం కావడంతో మళ్లీ వెటరన్ క్రికెటర్ల ఎంపికపై విండీస్ బోర్డు దృష్టి పెట్టింది.
మరిన్ని వార్తలు: