24 ఏళ్ళ అమ్మాయితో…19 ఏళ్ళ అబ్బాయి….

girl married minor boy in hyderabad
ప్రేమ ఓ మధుర జ్ఞాపకం…అది ఎప్పుడు…ఎక్కడ…ఎలా…ఎందుకు మొదలవుతుందో ఎవరికీ తెలియదు. ప్రేమించుకునే వాళ్ళకి కూడా. అలాగే పేద, ధనిక భేదాలు కూడా లేవు ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువు అయింది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ లో నమోదయ్యింది. ఆమె వయసు 24.. అతని వయసు 19 ఆమె ఎంబీఏ  చదువుంతుంటే అతను మాత్రం ఏడో తరగతితో చదువుకు స్వస్తి పలికి వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆమెది బంజారా హిల్స్ ప్రైమ్ లొకేషన్ లో ఆమె ఐదంతస్తుల భవనం, అతనుండేది బంజారా హిల్స్ బస్తీలోని రేకుల షెడ్డులో అయినా ఎలా పుట్టిందో తెలీదు వారి మధ్య ప్రేమ మధ్య చిగురించింది. తన ఇంటికి వాటర్‌ ట్యాంకర్‌తో నీళ్లు తీసుకొచ్చే క్రమంలో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. అలా ఆరు నెలలుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో చెప్పినా పెళ్లి చేయరని భావించి నాలుగు నెలల క్రితం ఇద్దరూ కలిసి  చెప్పాపెట్టకుండా ఇళ్లలోంచి వెళ్లిపోయారు.
girl-married
దీంతో మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో యువతి తల్లిదండ్రులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు వారిద్దరూ హఫీజ్‌పేట్‌లో ఉంటున్నట్టు గుర్తించి వీరిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారిఇకి వయసు నిర్ధారణ చేయగా ఆమెకు 24, అతనికి 19 అని తేలింది అతను మైనర్‌ కావడంతో  ఎవరి ఇళ్లకు వారిని పంపించారు. అయితే తాను ప్రేమించిన అతనితోనే ఉంటానని యువతి మొండికేయగా, మైనర్‌తో పంపేందుకు చట్టం ఒప్పుకోదని పోలీసులు అడ్డు చెప్పారు. దీంతో ఆమెను పునరావాస కేంద్రానికి పంపించారు. ప్రేమించిన వాడితో తనకు పెళ్లి కూడా జరిగిందని ఇప్పుడు ఎలా విడదీస్తారని, ప్రియుడి నుంచి తనను దూరం చేస్తే చచ్చిపోతానని బెదిరించింది. దీంతో ఎటూ పాలుపోని పోలీసులు న్యాయ సలహా తీసుకున్నారు. చట్టప్రకారం సదరు యువతిని ఎక్కడికి పంపించాలంటూ అడగగా ఆమె ఎవరి దగ్గరికి వెళ్లాలని అనుకుంటే అక్కడికే పంపించవచ్చని తేలింది. దీంతో తాను ప్రేమించిన వాడితోనే వెళ్తానంటూ ఆమె చెప్పడంతో పోలీసులు ఆమె కోరిక ప్రకారమే అతని దగ్గరకే పంపించి వేశారు.
girl