Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పర్యాటకులకు స్వర్గధామంగా భావించే గోవాలో స్ట్రిక్ట్ రూల్స్ అమలు కాబోతున్నాయి. ఇప్పటివరకు బహిరంగ మద్యపానంపై నిషేధం విధించిన గోవా సర్కారు.. ఇకపై బీచుల్లో తాగినా తప్పేనంటూ సర్క్యులర్ ఇచ్చింది. పోలీసులకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ.. గోవా టూరిస్ట్ యాక్ట్ కు సవరణలు చేసింది. ఈ దెబ్బతో గోవా టూరిజం మూలన పడుతుందని భయాందోళన వ్యక్తమవుతోంది.
కానీ గోవా సర్కారు మాత్రం అలాంటిదేమీ ఉండదని చెబుతోంది. బీచుల్లో పరిశుభ్రత చాలా అవసరమని, విదేశీ బీచులన్నీ అందంగా ఉంటున్నాయని, అదే ఫారినర్స్ గోవా వచ్చి మాత్రం రచ్చ చేస్తామంటే ఎందుకు ఊరుకోవాలని ప్రశ్నిస్తోంది. తాగాలనుకుంటే బార్ కు వెళ్లాలని , బీచులో ఆ పని చేస్తే శిక్ష తప్పదని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరికలు చేసింది సర్కారు.
బీజేపీ నిర్ణయంతో బీచులన్నీ క్లీన్ అవుతాయంటున్నారు ఆ పార్టీ సమర్థకులు. కానీ గోవాలో ఇలాంటి రూల్స్ అమలు చేయడం కష్టమని పోలీసులు అంటున్నారు. విదేశీ టూరిస్టులతో మర్యాదగా ప్రవర్తించాలని కేంద్రం చెబుతుంటే.. తాగితే తన్ని లోపలేయమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, ఎవరి ఆదేశాలు పాటించాలని వారు అయోమయానికి గురవుతున్నారు.
మరిన్ని వార్తలు: