టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కీలక నేతలంతా హాజరయ్యారు. ముందుగా ఆపరేషన్ సింధూర్‌కు మద్దతు తెలుపుతూ మోదీకి అభినందనలు తెలిపారు. అనంతరం ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించాల్సిన మహానాడుపై ప్రధానంగా చర్చించారు. కనీవిని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహిస్తున్నట్లు పొలిట్‌బ్యూరో సభ్యులు వెల్లడించారు. జూన్ 12 నుంచి కొత్తగా లక్ష వితంతు పెన్షన్లు అందించడం, మూడు గ్యాస్ సిలిండర్లకు ముందే డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.





