ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 850 MBBS సీట్లు

Good news for AP students.. 850 more MBBS seats
Good news for AP students.. 850 more MBBS seats

ఆంధ్ర ప్రదేశ్‌ మెడికల విద్యార్థులకు శుభవార్త అందింది. ఏపీలో మరో 850 MBBS సీట్లు రానున్నాయట. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో 5 వేలకుపైగా MBBS సీట్లు ఉండగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరో 850 సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో కొత్త కాలేజీల ద్వారా 750 సీట్లు, అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు కాలేజీల్లో 100 సీట్లు పెంచుకునేందుకు అధికారులు ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. 2025-26లో మరో 7 మెడికల్ కాలేజీలను ప్రారంభించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

కాగా, ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనవరి నుంచి జీతాలతో పాటు అలవెన్స్ లను కలిపి చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది. నైట్ అవుట్, డే అవుట్, ఓవర్ టైం అలవెన్సులను ఇప్పటివరకు ఆలస్యంగా చెల్లిస్తుండగా… ఇకపై జీతంతో పాటే ఇవ్వనుంది. 2017 PRC బకాయిలు, స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్ట్ కు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా దశలవారీగా చెల్లించనుంది.