ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..నేటి నుంచి ‘ఎస్‌ఐ’ పరీక్షలు

Good news for AP unemployed..'SI' exams from today
Good news for AP unemployed..'SI' exams from today

ఏపీ నిరుద్యోగులకు అలర్ట్..నేటి నుంచి ఏపీలో ‘ఎస్‌ఐ’ పరీక్షలు జరుగనున్నాయి. నేటి నుంచి రెండు రోజులు పాటు ఎస్సై అభ్యర్థుల నియామకానికి మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. ఇక ఇందులో భాగంగానే.. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరగనున్నాయి ఎస్‌ఐ వ్రాత పరీక్షలు.

పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేస్తున్నారు అధికారులు. ఇక ఈ తరుణంలోనే..గుంటూరు జిల్లావ్యాప్తంగా 9 కళాశాలలో రాత పరీక్షలు నిర్వహించనున్నారు పోలీసు అధికారులు. ఎస్సై అభ్యర్థుల రాతల పరీక్షలకు 7145 మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ అంటూ అధికారులు హుకుం జారీ చేశారు. మాల్ ప్రాక్టీస్, కాఫీయింగ్, తదితర అక్రమాలకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.