రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా ఎండలు కొడుతున్న సంగతి అందరికి తెలిసిందే. బయట అడుగుపెట్టలేని పరిస్థితిలు నెలకొన్నాయి. అధిక ఉష్ణోగ్రతలు అలాగే వడగాలులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగా అల్లాడిపోతున్నారు. ఈరోజు అలాగే రేపు తెలంగాణ మరియు ఏపీ రాష్ట్రాలలో తీవ్ర వడగాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది .
ఇలాంటి నేపథ్యంలో చల్లటి కబురు అందింది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న నాలుగు జిల్లాలలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తొమ్మిది జిల్లాల్లో 43.4° ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో మోస్తారు వర్షాలు కురుస్తాయంట . ఏపీలో కూడా 8వ తేదీ అలాగే 9వ తేదీలలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది . తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్షాలు ఉంటాయంట .