ఏపీలో వారికి జగన్ సర్కార్ శుభవార్త ఒక్కొక్కరి అకౌంట్ లోకి రూ. 11,500 సీఎం జగన్ మత్స్యకారులకు శుభవార్త చెప్పారు. తిరుపతి జిల్లా రాయదరువు వద్దగల మాంబట్టు ఎస్ఈజెడ్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభ ప్రాంగణం వద్ద నుంచే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
ఓఎన్జిసి, జిఎస్పిసి సంస్థల పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన వారికి నాలుగో విడతగా ఒక్కొక్కరికి రూ. 11,500 చొప్పున….ఆరేళ్లకు రూ. 69 వేల చొప్పున రూ. 161.86 కోట్ల సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్నారు.
ఈ మొత్తం తో కలిపి మొత్తం ఓఎన్జిసి పైప్ లైన్ నిర్మాణం వల్ల ఉపాధి కోల్పోయిన 23,4508 మందికి రూ. 485.58 కోట్ల పరిహారం చెల్లించినట్టు అవుతుంది. మొత్తం 40,012 మంది జీవనోపాధి కోల్పోగా జిఎస్పిసి పైప్ లైన్ వల్ల ఉపాధి దెబ్బతిన్న 16,554 మందికి రూ. 78.22 కోట్ల సాయాన్ని ఇప్పటికే చెల్లించారు. అదేవిధంగా ఓఎన్జిసి పైప్ లైన్ వల్ల ఉపాధి కోల్పోయిన 23,458 మందికి ఇప్పటికే మూడు విడతల్లో రూ. 323.72 కోట్ల పరిహారాన్ని జమ చేశారు.