గుడ్ న్యూస్ : “గజినీ 2” పై ఇంట్రెస్టింగ్ టాక్.!

Good News : Interesting Talk on "Ghajini 2"!
Good News : Interesting Talk on "Ghajini 2"!

కోలీవుడ్ మూవీ స్టార్ హీరోస్ లో టాలెంటెడ్ నటుడు సూర్య కూడా ఒకరు. మరి సూర్య హీరోగా నటించిన ఎన్నో బిగ్ హిట్ మూవీ ల్లో అందులోని కొన్ని ఐకానిక్ పాత్రల ల్లో “గజినీ” కూడా ఒకటి. దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో చేసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. అలాగే ఈ మూవీ ని హిందీలో కూడా రీమేక్ చెయ్యగా అక్కడ రికార్డు వసూళ్లు కొల్లగొట్టింది.

Good News : Interesting Talk on "Ghajini 2"!
Good News : Interesting Talk on “Ghajini 2”!

స్టార్ హీరో అమీర్ ఖాన్ తో ఏ ఆర్ మురుగదాస్ నే చేసిన ఈ మూవీ కి సీక్వెల్ పై కొన్నాళ్ల కితం పలు రూమర్స్ వచ్చాయి. అలాగే ఈ రూమర్స్ ఇపుడు నిజం అయ్యేలా ఉన్నాయని చెప్పుకోవాలి . మురుగదాస్ తమిళ్ సహా హిందీలో గజినీ 2 తియ్యనున్నారని టాక్ వైరల్ గా మారింది. అలాగే సూర్య కూడా హింది గజినీ పార్ట్ 2లో అమీర్ తో కనిపిస్తాను అని కంగువా హిందీ ప్రమోషన్స్ లో భాగంగా తెలిపినట్టుగా ఒక స్టేట్మెంట్ కూడా వైరల్ గా మారింది. మరి ఈ క్రేజీ సీక్వెల్ పై కూడా మరింత క్లారిటీ రావాల్సి ఉందని చెప్పాలి.