ఢిల్లీకి వెళ్ళిన గవర్నర్, బాబు రిపోర్ట్ ఇవ్వడానికేనా ?

Governor Narasimhan Delhi Tour after meeting with chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఎప్పుడూ సాగీ భేటీల్లాంటిదే అయినా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్ నరసింహన్ అన్ని ఢిల్లీ పర్యటనలకంటే భిన్నమైనది, ఇంకా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల కు సంబంధించి గవర్నర్ గత పర్యటనలన్నింటికంటే ఇదే ప్రధానమైనదని చెప్పుకోవచ్చు. కారణం గతంలో గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన తెలుగు రాష్ట్రాల్లో పాలన, పరిస్థితుల గురించి కేవలం నివేదించడం మాత్రమే జరిగేది. కానీ ఈసారి గవర్నర్ ఢిల్లీ పర్యటనలో రెండు తెలుగు రాష్ట్రాల గురించి, ముఖ్యమంత్రుల గురించి అందించే నివేదికల వలన ఈ భేటీ ప్రాధాన్యతని సంతరించుకుంది.

గవర్నర్ నరసింహన్ రెండు రోజుల క్రితం అంటే ఏప్రిల్ 22 వ తేదీ ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. విజయవాడలోని గేట్‌ వే హౌటల్‌లో సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ఏపీకి హోదా, విభజన హామీలు, కేంద్రం వైఖరి మొదలుకొని తాజా ధర్నపోరాట దీక్షలో బాలకృష్ణ వ్యాఖ్యల వరకు వివిధ అంశాలు, అనేక తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చింఛగా ఆ చర్చల అనతరం కేంద్రం మీద పోరాడుతున్న చంద్రబాబుకి గవర్నర్ సలహా కూడా ఇచ్చారు, అయితే దానిని బాబు సున్నితంగా తిరస్కరించారు కూడా దీంతో ఆ చర్చల ఫలితాన్ని కూడా గవర్నర్ మోడీ ముందు ఉంచనున్నట్టు తెలుస్తోంది.

ఎప్పటి నుండో టీడీపీకి వ్యతిరేకంగా గవర్నర్ నరసింహన్ నివేదికలు పంపుతున్నారనే ప్రచారం చాలాకాలంగా ఉంది. కేంద్రాన్ని తప్పుదోవ పట్టించడంలో ఆయనదే ప్రధాన పాత్ర అనేది టిడిపి శ్రేణుల్లో నెలకొని ఉన్న గట్టి నమ్మకం. అలాంటి తరుణంలో ఇటీవలే కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ చంద్రబాబును కలవడం, ఆ తరువాత గవర్నర్ సమావేశం కావడం… ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ఢిల్లీ బయలుదేరి వెళుతుండటం, అక్కడ ఈ సారి పర్యటనలో గవర్నర్ కేంద్ర ముఖ్యలకు ఇచ్చే నివేదిక ఎపికి సంబంధించి అత్యంత కీలకం కానుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
 

చంద్రబాబుతో సహా టిడిపి ముఖ్యలపై కేంద్రం కేసులు పెట్టేందుకు సిద్దమవుతోందని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ఈ ఢిల్లీ ప్రయాణం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్ రెండ్రోజులు అక్కడే ఉండటాన్ని బట్టీ చూస్తే ఏం చేయాలి ? ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలి అనేది కూడా చెప్పి పంపడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే కేంద్రం బాబు మీద పగబట్టి పగతీర్చుకునేందుకు సిద్దమయినట్టు ఉంది. త్వరలో కర్ణాటక ఎన్నికల తతంగం కూడా పూర్తయిపోతుంది కాబట్టి మరో 15 రోజుల్లో ఏపీలో కమల రాజకీయ వికృత క్రీడ మొదలు పెట్టాలనేది వ్యూహంగా చెబుతున్నారు. చంద్రబాబు వస్తే తప్ప ఆయన్ని కలవని నరసింహన్ ప్రత్యేకంగా అమరావతి వచ్చి మరీ చంద్రబాబును కలవడం వెనుక కమల పెద్దల రాయబారం ఉందంటున్నారు విశ్లేషకులు.