కరోనా.. లాక్ డౌన్ తో జనం అల్లల్లాడిపోతుంటే… మరో పక్క వ్యభిచార కార్యకలాపాలు ఘోరంగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ అన్ని వ్యాపారాలు కరోనాతో మూతపడితే.. వ్యభిచార కార్యకలాపాలు మాత్రం నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. నిరుపేదలు ఓపక్క తిండి లేక ఆకలితే ఆలమటిస్తుంటే… కరోనా కాలంలో కూడా శారీరక సుఖం కోసం వెంపర్లాడుతుండటం షాక్ కి గురిచేస్తుంది. రసిక ప్రియుల కోసం కొందరు అమ్మాయిలను సరఫరా చేస్తూ భారీగా సొమ్ము చేసుకున్న ఘటన తాజాగా వెలుగు చూసింది.
అయితే ప్రస్తుతం ఎలాంటి ఉపాధిసౌకర్యం లేకపోవడంతో అక్రమార్కులు అమ్మాయిలను మభ్యపెట్టి వ్యభిచారంలోకి దించుతూ దందా కొనసాగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని గుట్టుగా సాగుతున్న వ్యభిచార కేంద్రాన్ని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు చేధించారు. నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులను కూడా అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతానికి చెందిన అబ్దుల్ మిస్కిన్ దంపతులు సంపాదన కోసం వ్యభిచారాన్ని ఎంచుకున్నారు. షేక్ ముస్తాక్ అనే ఆటో డ్రైవర్‌తో కలిసి ముంబై నుంచి ఇద్దరు యువతులను నగరానికి దింపారు. వారితో పాతబస్తీ, రాజేంద్రనగర్ సర్కిల్ ప్రాంతాల్లో కొద్దిరోజులుగా గుట్టుగా వ్యభిచారాన్ని సాగిస్తున్నారు. విటులు ఫోన్‌చేస్తే ఆటోలో షేక్ ముష్తాక్ ఆ యువతులను వారింటికి తీసుకువెళ్తాడు. మూడు రోజుల క్రితం శాస్త్రిపురం డివిజన్లోని కింగ్స్‌కాలనీలో ఓ ఇంటిని ఈ ముఠా అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తోంది. దీంతో అర్ధరాత్రి సమయంలో కూడా యువకులు వస్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు రహస్యంగా సమాచారం అందించారు. దీంతో విషయం వెలుగు చూసింది.