బీజేపీ నాయకులకి కాంగ్రెస్ తో పోటీ పడటం కంటే తెలుగుదేశంతో పోటీ పడటం గౌరవంలా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీకి శత్రువయిన కాంగ్రెస్ ని విమర్శించాల్సింది పోయి తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారని, ఈ ఘటనతో టీడీపీకి మరో దారుణమైన పరాభవం ఎదురైందని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘కాంగ్రెస్ ’తో కలిసి టీడీపీకి ఘోర పరాజయానికి గురైందని, ఆ పార్టీ చెంత చేరిన తెలుగుదేశం పార్టీ అవినీతి గబ్బులో చేరిందని ఆరోపించారు.
టీడీపీ ప్రభుత్వాన్ని త్వరలో ప్రజల ఎదుట దోషిగా నిలబెడతానని, అవినీతిలో కూరుకుపోయిన టీడీపీని ప్రజలు తిరస్కరిస్తారని, వారి స్కామ్ లపై తాను మాట్లాడుతుంటే వాళ్లెందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేతలు సరైన సమాధానాలు చెప్పేంత వరకు వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. త్వరలో టీడీపీని ప్రజల ముందు దోషిగా నిలబెడతామని కాంగ్రెస్ చెంతన చేరిన టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని జీవీఎల్ అన్నారు.