‘ఆ’ సైట్ లు చూస్తే…వాళ్ళ చేతుల్లో మీ బొమ్మ బీ కేర్ ఫుల్ !

hackers-hacking-personals-with-porn-sites

మీరు పోర్న్ వెబ్సైట్లు చూస్తారా ? అయితే తస్మాత్ జాగ్రత్త కొత్తరకం హ్యాకర్లు రంగంలోకి దిగారు. ఇటీవల బెంగుళూరులో నమోదయిన ఒక కేసును పరిశీలిస్తే కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కి ఒక ఈ మెయిల్ వచ్చింది, అందులోని వీడియో చూసి నోట మాట ఆగిపోయింది, ఏమి చేయాలో తెలియక పోలీసులకి దగ్గరకి పరిగెత్తాడు. ఇంతకీ ఆ ఈమెయిల్‌లో ఆ ఇంజినీర్ భయపడేంతగా ఏముందంటే ? నెట్‌లో పోర్న్‌ చూస్తున్న సమయంలో ఆ ఇంజినీర్ కి తెలియకుండానే వెబ్‌ కెమెరా సాయంతో అతని వ్యక్తిగత దృశ్యాలను రికార్డ్‌ చేశాడు. ఆ వీడియో పంపి 2200 డాలర్ల విలువైన బిట్‌కాయిన్లను కడితే కట్టు లేదా నీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వారికీ, కుటుంబ సభ్యులకు ఈ సెక్స్‌ వీడియో పంపుతాను’ అని బెదిరించాడు.

దిమ్మతిరిగిన పోలీసులు కేసును సైబర్ క్రైమ్ కి అప్పచెప్పారు. వారు చేసిన దర్యాప్తు పోర్న్ చూసే వారందరికీ ముచ్చెమటలు పట్టేలా చేసింది. వారి వివరాల ప్రకారం నెట్‌లో పోర్న్‌ దృశ్యాలు చూస్తున్న సమయంలో కంప్యూటర్‌లోకి హ్యాకర్‌ ప్రవేశించి వెబ్‌ కెమెరాను తన కంట్రోల్‌లోకి తీసుకుని వెబ్‌ కెమెరాతో అతని వ్యక్తిగత దృశ్యాలను రికార్డ్‌ చేశాడు. అతని కాంటాక్ట్‌ లిస్ట్‌ను సైతం హ్యాక్‌ చేశాడు. వాటితోనే బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డాడు. ఈ ఘటన హ్యాకర్లు డబ్బు కోసం ఎంతకి తెగిస్తున్నారో అర్ధం అవుతుంది.
ఇదొక్కటే కాక ఏయే వీడియోలు చూశారు, ఏయే పోర్న్ వెబ్సైట్లను తిరిగేశారు ఇలా మీ బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం బట్టబయలయ్యే అవకాశముందట. ఇన్ కాగ్నిటో మోడ్లో చూసినా ఆన్లైన్ చరిత్ర అంతా వెలికిరానుంది.

పోర్న్ వెబ్సైట్లతోపాటు ఆన్లైన్ లో మీరేం చూశారో బ్రౌజింగ్ హిస్టరీతో సహా వెల్లడయ్యే అవకాశం ఉందని సాన్ ఫ్రాన్సికోకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ బ్రెట్ థామస్ వెల్లడించారు. హ్యాకర్లు లాగ్స్ లిస్ట్ను దొంగతనంగా పొందే అవకాశముందని, దానిద్వారా యూజర్ పేరు కూడా తెలుసుకోవచ్చునని, ఈ వివరాలతో క్రాస్-రిఫరెన్స్ చేసుకొని పోర్న్ వంటి వెబ్సైట్లలో లాగిన్ అయిన వివరాలను తెలుసుకోవచ్చునని ఆయన వెల్లడించారు. చాలా పెద్ద ఎత్తున హ్యాకింగ్ కు పాల్పడితే తప్ప ఈ వివరాలు తెలుసకునే అవకాశం లేదని, అయితే భవిష్యత్లో హ్యాకర్లు ఈ వివరాల కోసం దాడులు చేయవచ్చునని తెలిపారు. ఇకనయినా పోర్న్ సైట్లు చూసేవారు జాగ్రత్త పడితే మంచిది లేదంటే మీకూ రేపోమాపో ఆ బ్లాక్ “మెయిల్” రావచ్చు. పరువు తీసుకోవడం ఎందుకు చెప్పండి.