అమ్మ‌తో చిన్నారి వ‌ర్మ‌

Ram Gopal Varma Shared In Mother Photo On Facebook

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి అస్స‌లు మాట్లాడ‌ని వ్య‌క్తి డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ‌. భార్య‌తో విడాకులు తీసుకున్న వ‌ర్మ ఆ విష‌యాన్ని ఎక్క‌డా ప్ర‌స్తావించరు. కుమార్తె రేవ‌తి గురించి ఆయ‌న చెప్పిన సంద‌ర్బాలు కూడా అంత‌గా లేవు. ఇక వ‌ర్మ త‌ల్లిదండ్రుల గురించి అంత‌గా ఎవ‌రికీ తెలియ‌దు. చాలా ఏళ్ల క్రితం ఓ సారి మాత్రం వ‌ర్మ త‌ల్లి ఒక‌ చాన‌ల్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. అంత‌కుమించి రాంగోపాల్ వ‌ర్మ కుటుంబ స‌భ్యులు వివ‌రాలు ఎప్పుడూ బ‌య‌ట‌కు రాలేదు.

సోష‌ల్ మీడియాలో అత్యంత యాక్టివ్ గా ఉండే వ‌ర్మ‌… ట్విట్ట‌ర్ లోగానీ, ఫేస్ బుక్ లోగానీ ఎప్పుడూ వ్య‌క్తిగ‌త విష‌యాలు పోస్ట్ చేయ‌లేదు. సినిమాల‌కు సంబంధించిన విష‌యాలు, స‌మ‌కాలీన ప‌రిస్థితుల‌పై త‌న అభిప్రాయాలు తెలియ‌జేయ‌డానికి మాత్ర‌మే వ‌ర్మ సోష‌ల్ మీడియాను వాడుకుంటారు. అలాంటిది హ‌ఠాత్తుగా వ‌ర్మ త‌న త‌ల్లి సూర్య‌మ్మ ఫొటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయ‌టం చ‌ర్చ‌నీయాంశ‌మ‌యింది. ఈ ఫొటోలో త‌ల్లి ప‌క్క‌న చిన్న‌నాటి రాంగోపాల్ వ‌ర్మ నిల్చుని ఉన్నారు. ఆ అంద‌మైన మ‌హిళ మా అమ్మ‌. ప‌క్క‌న జోక‌ర్ లా, సాధార‌ణంగా క‌న‌ప‌డుతూ నిల‌బ‌డి ఉన్న కుర్రాడిని నేనే అని వ‌ర్మ ఆ ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ఫ్యాంట్, ష‌ర్ట్ వేసుకుని వ‌ర్మ త‌ల్లి ప‌క్క‌నే విన‌యంగా నిల్చుని ఉన్నారు. వ‌ర్మ ఫొటో పోస్ట్ చేసిన వెంట‌నే నెటిజ‌న్లు కామెంట్లు పెట్టారు. ఈ ప్ర‌పంచానికి అద్భుత‌మైన కానుక‌ను ఇచ్చిన అమ్మ‌కు థాంక్స్ అని కొంద‌రు వ్యాఖ్యానిస్తే..మ‌రికొంద‌రు తెలివి, ధైర్యం ఉన్న డైరెక్ట‌ర్ అని ప్ర‌శంసించారు.

మరిన్ని వార్తలు:

545 నుంచి 546 ఎప్పుడ‌య్యాయి?

ఆ కమెడియన్ కి బాబు థాంక్స్.