Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రంజాన్ మాసం ప్రారంభమైంది. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో హాలీమ్ హవా మొదలైంది. పగలంతా పచ్చి మంచినీరు కూడా తాగకుండా నిష్టగా చేసే ముస్లిం సోదరుల ఉపవాసాల నెలలో ఇఫ్తార్ విందులు ముస్లిం,ముస్లిమేతర సోదరుల్లో సమైక్యతకు వేదికలవుతున్నాయి. అయితే ఈ మాసంలో హలీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హలీమ్ కు హైదరాబాద్ లోని బార్కాస్ కు ఒక ప్రత్యేక సంబంధం ఉంది. నిజానికి ఇది బార్కాస్ కాదు, బారక్స్ అంటే సైనికులకి ఇచ్చిన శిబిరాలని బారక్స్ అనే వాళ్ళు అది కాలక్రమేనా వాడుకలోకి వచ్చి బార్కాస్ అయ్యింది.
హైదరాబాద్ ని ఏలిన నిజాము సైన్యం ఉండే బారాక్స్ ఏ ఇప్పటి బార్కాస్. నిజాము సైన్యంలో అరబ్బు దేశాలకు చెందిన వారు ఎక్కువగా ఉండేవారు. వారిని చావూష్ లని పిలిచేవారు. అప్పట్లో అరబ్బు దేశాలు ఇంత సంపన్న దేశాలు కూడా కాపోవడంతో బతుకుదెరువుకోసం నిజాం సైన్యంలో పనిచేయడానికి ముఖ్యంగా ఎమన్ దేశస్థులు ఎక్కువగా హైదరాబాద్ వచ్చి సైన్యం లో చేరారు. ఎమన్ లోని హజ్రల్ మౌత్ ప్రాంతానికి చెందినవారిని ఎక్కువగా నిజాము సైన్యంలో చేర్చుకున్నారు. ఈ ప్రాంతం వారే ఎన్ధుఅక్నతె వారు విశ్వాసానికి, యుద్ధవిద్యలకు పెట్టింది పేరు.
ముఖ్యంగా నిజాము వ్యక్తిగత రక్షణ దళంలో ఈ సైనికులు ఎక్కువగా ఉండేవారు. ఈ ఎమన్ సైనికులు తమతో పాటు ఎమన్ కు చెందిన వంటకం హరీస్ కూడా తీసుకువచ్చారు. అదే హలీమ్ గా మారింది. హలీమ్ నిజానికి అరబీ వంటకం. హైదరాబాదులో నిజాం కాలంలో ఎమన్ నుంచి వచ్చిన వారు అలా ఈ వంటకాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం తర్వాత నిజాం సైన్యం రద్దయ్యింది. కాని వెనక్కి వెళ్ళని వారు బార్కాస్ ప్రాంతంలోనే స్థిరపడిపోయారు. అలా ఒకరకంగా ఏమన్ దేశం నుండి హైదరాబాద్ కి ఈ వంటకం వచ్చినట్టయ్యింది.