ముస్లింలకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త!

Election Updates: Forms not received by BRS candidates in 10 seats
Election Updates: Forms not received by BRS candidates in 10 seats

మైనార్టీల సంక్షేమంలో భాగంగా సీఎం కేసీఆర్ గారు ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకొని మొదటి దశలో భాగంగా ఎంపిక చేసిన 10 వేల మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కులను ఈనెల 16 నుండి పంపిణీ ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు. మైనార్టీల వివిధ సమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ హామీ మేరకు సచివాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, మైనారిటీలకు లక్ష ఆర్థిక సాయం, ఓవర్ సీస్ స్కాలర్ షిప్స్, స్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్, క్రిస్టియన్ స్మశాన వాటికలు,మౌజంల సంఖ్య పెంపు, MTF,RTF తదితర అంశాలపై చర్చించామని వెల్లడించారు. గౌరవ వేతనం పొందే ఇమామ్‌లు-మౌజిన్‌ల సంఖ్య పెంపు ,స్మశాన వాటికలకు 125 ఎకరాల కేటాయింపు వంటి రెండు హామీలను ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, ఇప్పటికే కేటాయించిన 270 కోట్లకు అదనంగా, మరో 130 కోట్లు కేటాయించి మొత్తం 400 కోట్లు ఈ కార్యక్రమం అమలుకు కేటాయించాలని ఆర్థిక శాఖను అదేశించటం జరిగిందని పేర్కొన్నారు