వివాదంలో చిక్కుకున్న హన్సిక…!

Hansika Reveals First Look Of Her 50th Film Maha Movie

తెలుగు, తమిళం సినిమాలు కొన్ని సార్లు వివాదాలకు దారి తీస్తాయి. తెలుగు లో ఈ వివాదాలు తక్కువ ఉన్నపటికీ తమిళనాట ఈ పరిస్థితి కొంచెం భిన్నం గా ఉంటుంది. ఇటీవల విదులైన ఇలయ దలపతి విజయ్, మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సర్కార్ చిత్రం వివాదం చుట్టూ ముట్టాయి. తాజాగా మరో సినిమా వివాదంలో ఇరుకున్నది. తమిళంలో హన్సిక నటించిన చిత్రం మహా. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దం అవ్వుతుంది. అయితే ఈ చిత్రం నుండి హన్సిక కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో హన్సిక సాధువు బట్టలు ధరించి సింహాసనం పైన అడ్డదిడ్డంగా కూర్చొని నోటిలో చుట్టతో ఉన్న ఫోటో చిత్ర బృందం విడుదల చేశారు. అయితే ఈ ఫస్ట్ లుక్ సాధువులు, మరియు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నదని హీరొయిన్ హన్సిక పైన సమీప పోలీస్ స్టేషన్ లో కేసు వేశారు హిందు, మరియు సాధువు సంఘం వారు.

maha-movie

హన్సిక అండ్ ఆ చిత్ర దర్శకుడు సారీ చెప్పిన కూడా వారు పట్టించుకోలేదు. వెంటనే మహా చిత్రం నుండి ఆ సిన్స్ మరియు వీడియోస్ వెంటనే డిలీట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. అలాగే హిందువుల గురుంచి తప్పుగా చూపిస్తే మాత్రం ఆ తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఏది ఏమైనా విడుదలకు ముందే మహా చిత్రం పైన ఇటువంటి వివాదం రావడం ఓ పక్క సంతోషం గా ఉన్న మరో పక్క మాత్రం హిందువుల నుండి మరే వివాదం వస్తుందని చిత్ర బృందం బయపడుతుంది. ఎందుకంటే సర్కార్ చిత్రం కూడా మొదట వివాదం తో మొదలై మంచి విజయాని దక్కించుకుంది. అలాగే మహా చిత్రం కూడా విజయం సాదిస్తుందని చిత్ర బృందం భావిస్తునారంట