యంగ్ హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘హనుమాన్’. మన దేశంలో సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మూవీ ఇదే. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిర్మాతలకు కాసుల పంట పండించింది. థియేటర్లలో రిలీజై నెలన్నర రోజులు పూర్తవుతున్నా ఇప్పటికీ కలెక్షన్లు వస్తున్నాయి. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అలాంటివారందరికీ ఒక గుడ్ న్యూస్. త్వరలోనే ఈ బ్లాక్ బస్టర్ సినిమా స్ట్రీమింగ్కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 హనుమాన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో తేజ సజ్జా ఓటీటీ రిలీజ్ డేట్‌ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది. మార్చి 2 నుంచే హనుమాన్ మూవీ ను స్ట్రీమింగ్కు తీసుకురానున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.