యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ “హను మాన్” కోసం తెలిసిందే. మరి సాలిడ్ హైప్ అండ్ భారీ పోటీ నడుమ వచ్చిన ఈ మూవీ లో యూఎస్ మార్కెట్ లో కూడా డీసెంట్ రిలీజ్ కి వచ్చింది. మరి ఈ మూవీ కూడా నెమ్మదిగానే స్టార్ట్ అయినప్పటికీ సాలిడ్ మౌత్ టాక్ రావడంతో అక్కడ కూడా ప్రేక్షకులు హను మాన్ ని లైన్ కడుతున్నారు.
దీనితో కేవలం ప్రీమియర్స్ కే హాఫ్ మిలియన్ మార్క్ దగ్గరకి చేరుకున్న ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 1 మిలియన్ డాలర్స్ మార్క్ దిశగా దూసుకెళ్తుంది. మరి లేటెస్ట్ గా ఈ మూవీ యూఎస్ లో 8 లక్షల డాలర్స్ గ్రాస్ ని క్రాస్ చేసినట్టుగా యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు. ఇక దీనితో పాటుగా హను మాన్ కి మరింత డిమాండ్ నెలకొంది అని అందుకే వచ్చే వారం నుంచి థియేటర్స్ సంఖ్యా కూడా పెంచుతామని తెలిపారు. మొత్తానికి అయితే యూఎస్ మార్కెట్ ను హను మాన్ టేకోవర్ చేస్తున్నాడని చెప్పాలి.