Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎక్కడో స్విచ్ వేస్తే ఇంకెక్కడో బల్బ్ వెలిగినట్టు ప్రస్తుతం టీడీపీ ఎదుర్కొంటున్న సవాళ్ల మధ్య ఎప్పటినుంచో కాని పని ఒకటి తేలిగ్గా అయ్యే పరిస్థితి వచ్చింది. లోకేష్ రాజకీయ ఆరంగేట్రం దగ్గర నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న నందమూరి హరికృష్ణ చాన్నాళ్ల తర్వాత సీఎం చంద్రబాబుకు అనుకూలంగా గొంతు ఎత్తారు. Nda నుంచి వైదొలగడంతో పాటు కేంద్ర సర్కార్ పై అవిశ్వాసం పెట్టాలని బాబు తీసుకున్న నిర్ణయాన్ని హరికృష్ణ స్వాగతించారు. ప్రజాసమస్యల విషయంలో టీడీపీ రాజీపడే ప్రసక్తే లేదని ఆయన వ్యాఖ్యానించారు.
హరికృష్ణ వ్యాఖ్యలతో ఇటు టీడీపీ శ్రేణుల్లో, అటు నందమూరి అభిమానుల్లో హర్షం వ్యక్తమైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యూ టర్న్ తీసుకుని టీడీపీకి ఇబ్బందులు సృష్టిస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఎన్టీఆర్ కి టీడీపీ లో పెద్ద పీట వేసే పరిస్థితి వస్తుందని వాళ్ళు ఆశిస్తున్నారు. నాయకత్వం మాట ఎలా ఉన్నప్పటికీ ప్రచారపర్వంలో ఎన్టీఆర్ టీడీపీకి తిరుగులేని అస్త్రం అవుతాడని నందమూరి అభిమానులు అంటున్నారు. తాజా పరిణామాలతో బాలయ్య , ఎన్టీఆర్ మధ్య కూడా దూరం తగ్గే అవకాశం వుంది. త్వరలో నందమూరి కుటుంబం అంతా ఒక్కటిగా నిలబడే పరిస్థితులు వస్తాయని టీడీపీ శ్రేణులు కూడా అంటున్నాయి.