హరీష్ ఆవేదన తీరనిదే !

Harish Rao Reaction On KCR Cabinet Expansion

తెలంగాణ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. బాధ్యతలను తీసుకున్న వెంటనే కేసీఆర్ పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఢిల్లీ రాజకీయాల గురించి ఎంపీలతో భేటీ అయిన ఆయన, ఇపుడు కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తొలిసారిగా ఇవ్వడం విశేషం. ముందునుంచే జాతీయస్థాయి రాజకీయాలపై దృష్టి పెడతానంటూ చెప్పిన కేసీఆర్ ఇపుడు ఈ నిర్ణయంతో ఆ దిశగా తొలి అడుగు వేసినట్టు తెలుస్తోంది. పార్టీనీ కాపాడుకోవడం, పార్టీని ఇంకా బలోపేతం చేయడం కోసం కేటీఆర్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. పార్టీ కార్యవర్గ సమావేశం కంటే ముందే టీఆర్ఎస్ అధినేత ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇపుడందరి నోళ్లలో ఇదే అంశం గురించి చర్చ నడుస్తోంది. నిజానికి సీఎం త‌ర్వాత సీఎం అంతటి వాడుగా కేటీఆర్ వెలుగొందుతున్నాడు. ముఖ్య‌మంత్రి కుర్చీలో కూర్చోవ‌డం లేద‌న్న‌మాటే గాని బండి న‌డుపుతున్న‌ది మాత్రం కేటీఆర్‌. గ‌త కొంత‌కాలంగా కేటీఆర్‌కు ఇస్తున్న ప్రాధాన్యం హ‌రీష్ రావును ఆవేద‌న‌కు గురిచేస్తోంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

హరీష్ ఆవేదన తీరనిదే ! - Telugu Bullet

దీనిని హ‌రీష్ చాలాసార్లు కొట్టిపారేశారు. అయితే, ఆయ‌న ఒప్పుకోక‌పోయినా హ‌రీష్ బాధ ప‌డ్డాడు అని వార్త‌లు రావ‌డంలో వింత ఏం లేదు, త‌ప్పు కూడా లేదు. ఎంతో కాలం నుంచి పార్టీని తీర్చిదిద్దుకుంటూ వ‌చ్చి అది తన తర్వాత వచ్చిన కేటీఆర్ చేతికి వెళ్లిపోతుంటే హ‌రీష్ ఆవేద‌న చెందడంలో త‌ప్పులేదు. పోనీ హ‌రీష్‌కు అర్హ‌త లేదా అంటే కేటీఆర్ కంటే ఎక్కువ ఉంది, మంచి స‌మ‌ర్థ‌త క‌లిగిన వాడు కాబ‌ట్టి బాధ‌ప‌డ‌టంలో ఏ మాత్రం సందేహం లేదు. కాక‌పోతే పుత్ర వాత్స‌ల్య‌పు మాయ‌లో హ‌రీష్ మ‌స‌క‌బారి పోయాడని విశ్లేషకులు అంటున్నారు. ఈరోజు కేటీఆర్ పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ ప‌ద‌వి జాతీయ పార్టీల్లో వేరు, ప్రాంతీ పార్టీల్లో వేరు. ప్రాంతీయ పార్టీల్లో ఈ ప‌ద‌వి చాలా కీల‌క‌మైన‌ది. అంటే ఇక‌ నుంచి హ‌రీష్ రావుతో పాటు అంద‌రూ కేటీఆర్ క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేయాల్సి ఉంటుంది. అయితే, విమ‌ర్శ‌ల‌ను ముందే ఊహించిన కేసీఆర్ కొడుకును హ‌రీష్‌ను ఇంటికెళ్లి క‌ల‌వ‌మ‌ని చెప్ప‌డంతో దానిని ఆయ‌న తుచ త‌ప్ప‌కుండా పాటించారు. ప‌ద‌వి లేదు గాని హ‌రీష్ అయినా నేను అయినా ఒకటే అని జ‌నం చేత న‌మ్మించ‌డానికి కేసీఆర్ వేసిన ప్లాన్ ఇది విశ్లేషకులు భావిస్తున్నారు. హ‌రీష్‌ను కేటీఆర్ క‌లిశాక ట్విట్ట‌రు ద్వారా కూడా హ‌రీష్ రావు స్పందించి మరిన్ని వార్తలు రాకుండా చూసుకున్నారు.