ఉత్తమ్ కు 12 ప్రశ్నలు సంధించిన హరీష్ రావు…!

Harish Wants Answers To 12 Questions By Uttam On Alliance With TDP

మహా కూటమి ఏర్పాటు నేపథ్యంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి 12 ప్రశ్నలతో మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖాస్త్రాన్ని సంధించారు. చంద్రబాబుతో పొత్తు వల్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న భయాందోళనలను నివృత్తి చేయాలని లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు… టీడీపీతో కాంగ్రెస్ పొత్తు షరతులతో కూడినదా? సిగ్గులేని పొత్తా? స్పష్టం చేయాన్నారు. గతంలో టీఆర్ఎస్…కాంగ్రెస్ ,టీడీపీలతో షరతులతో కూడిన పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు చివరి దాకా తెలంగాణను అడ్డుకున్నారని…ఆయన ఎప్పటికే ఆంధ్ర బాబే అన్నారు. ఈ మేరకు ఉత్తమ్ కు 12 ప్రశ్నలు సంధించారు.

harish-uttam

– తెలంగాణ వ్యతిరేక వైఖరిని విడనాడుతానని చంద్రబాబు నుంచి హామీ తీసుకున్నారా?

– పోలవరం 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకుందా?

– సీలేరు ప్రాజెక్టు వెనక్కి ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నారా? ఈ ప్రాజెక్ట్ కు బదులుగా తెలంగాణకు ఏమైనా నష్టపరిహారం ఇచ్చేందుకు బాబుతో ఒప్పందం చేసుకున్నారా?

– హైకోర్టు సత్వర విభజన సహా, ప్రభుత్వ సంస్థల విభజనలో స్తంభన తొలగించడానికి చంద్రబాబు నుంచి ఏమైనా హామీ తీసుకున్నారా?

– పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా కృష్ణా నీటిలో తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీల వాటా కేటాయించడానికి తమకు అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పించగలరా?

uttam-kumar-reddy

– తెలుగు జాతి’ అని మాట్లాడే చంద్రబాబు.. హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు మంచినీళ్లు ఇవ్వడానికి తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకంపై కేంద్రానికి చంద్రబాబు ఫిర్యాదు చేశారి.. మరి అది తప్పేనని ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారా?

– విద్యుత్ శాఖలో 1200 మంది ఆంధ్రా ఉద్యోగులను విధుల్లో చేర్చుకుంటామని, తెలంగాణపై ఆర్థిక భారం తగ్గిస్తామని చంద్రబాబుతో చెప్పిస్తారా? కోర్టు కేసులను ఉపసంహరింపజేస్తారా?

– నిజాం హయాం నాటి ఆస్తులు తెలంగాణకే తప్ప, ఏపీకి ఉండదనే సత్యాన్ని చంద్రబాబు అంగీకరించారా? ఈ విషయమై కోర్టులో వేసిన కేసులను ఉపసంహరించుకుంటామని బాబుతో ఒప్పందం ఏమైనా చేసుకున్నారా?

– పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్ల భద్రాచలం రామాలయం సహా, తెలంగాణలో లక్ష ఎకరాలు నీట మునుగుతాయి. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా? ‘పోలవరం’పై కాంగ్రెస్, చంద్రబాబు వైఖరులేంటి? తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయగలరా?

uttam-harish

– పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించేందుకు తమకు అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పిస్తారా? ‘పాలమూరు- రంగారెడ్డి’పై చంద్రబాబు వైఖరేంటి? చంద్రబాబు వైఖరి చెప్పకుండా పొత్తుపెట్టుకుంటే అది తెలంగాణ ప్రజలకు విఘాతం కాదా?

– కాళేశ్వరం, తమ్మిడిహట్టి, సీతారామ, తుపాకుల గూడెం, దేవాదుల, పెన్ గంగ, రామప్ప-పాకాల లింకేజీ తదితర ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన చంద్రబాబు వాటిని వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకున్నారా? ఆ ప్రాజెక్టులు నిర్మిస్తే తమకు అభ్యంతరం లేదని చంద్రబాబు చెప్పగలరా?

– ఇకపై తెలంగాణకు వ్యతిరేకంగా వాదించనని, ప్రాజెక్టులు, ఉద్యోగుల విభజన, ప్రభుత్వ సంస్థల విభజన, హైకోర్టు విభజన వంటి విషయాల్లో తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తానని చంద్రబాబు ఒప్పుకున్నారా? అని ప్రశ్నించారు.