కొత్త ఓటిటి డేట్ ని ఫిక్స్ చేసుకున్న “హరోం హర”

"Harom Hara" fixed new OTT date
"Harom Hara" fixed new OTT date

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవ దళపతి సుధీర్ బాబు హీరోగా మాల్వికా శర్మ హీరోయిన్ గా దర్శకుడు జ్ఞ్యాన సాగా ద్వారకా తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా మూవీ నే “హరోం హర”. మరి గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో సుధీర్ బాబు పై సాలిడ్ ఎలివేషన్స్ తో తెరకెక్కించిన ఈ మూవీ బిగ్ స్క్రీన్స్ పై సుధీర్ బాబు గత మూవీ లతో పోలిస్తే బెటర్ గానే పెర్ఫామ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటిటిలో రిలీజ్ కావాల్సింది కానీ ఆలస్యం అయ్యింది.

"Harom Hara" fixed new OTT date
“Harom Hara” fixed new OTT date

ఈ మూవీ హక్కులు రెండు ఓటిటి యాప్స్ ఆహా, ఈటీవీ విన్ వారు సొంతం చేసుకోగా ఈ జూలై 11నే రిలీజ్ కి ప్లాన్ చేశారు కానీ ఒక కారణం చేత ఆగిపోయింది. అయితే ఇపుడు ఫైనల్ గా కొత్త రిలీజ్ డేట్ బయటకి వచ్చింది. ఈ మూవీ ని ఈటీవీ విన్ వారు ఈ జూలై 18 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొస్తునట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో స్ట్రేంఇన్గ్ డేట్ ఒక వారానికి వాయిదా పడిందని చెప్పాలి. ఇక ఈ మూవీ కి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా సుబ్రహ్మణ్యేశ్వర మూవీ స్ వారు నిర్మాణం వహించారు.