తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆస్పత్రిలోనే ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలోనే.. హైదరాబాద్: యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ని పరామర్శించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ…ఆయన త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు. మళ్లీ యాక్టివ్ రాజీకీయాల్లోకి రావాలని వెల్లడించారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ హెల్డ్ బులిటెన్ విడుదల అయింది. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. నిన్న సాయంత్రం నాలుగు గంటలకు పైగా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన యశోద ఆస్పత్రి వైద్యులు…మేజర్ సర్జరీ కావడంతో మరింత పర్యవేక్షణ అవసరం అవుతుందని వివరించారు.
ఐవి ఫ్లూయిడ్స్,యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ తో మెడికేషన్ కొనసాగుతోందని చెప్పారు యశోద ఆస్పత్రి వైద్యులు. వైద్యుల పర్యవేక్షణలో సాధారణ డైట్ ఫాలో అవుతున్నారన్నారు. కొంత కోలుకున్న తర్వాత నడిపించే ప్రయత్నం చేస్తారు… ఫిజియథెరపీ కూడా నిర్వహిస్తారని యశోద ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.