హీరో గోపీచంద్ కి యాక్సిడెంట్…తీవ్ర గాయాలు !

Hero Gopichand Severely Injured In Shoot

గోపిచంద్ హీరోగా, తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, అనిల్ సుంకర నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం, ఇండియా, పాకిస్థాన్ బోర్డర్‌లో గల జైసల్మేర్ దగ్గర జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 32 కోట్ల భారీ బడ్జెట్‌తో గోపీ కెరీర్ లోనే అత్యంత పెద్ద బడ్జెట్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. గోపీచంద్‌కి జోడీగా ఈ సినిమాలో కత్రినాకి జిరాక్స్ లా ఉండే జరీన్ ఖాన్ నటిస్తోంది. అయితే ఈ సినిమాలో షూట్ లో భాగంగా ఆయన గాయపడ్డాడు. రాజస్థాన్ లో ఆయన కొత్త సినిమా షూటింగ్ జరుపుతుండగా ఆయనకు స్వల్ప ప్రమాదం జరిగిందని చిత్రయూనిట్ తెలిపింది. వెంటనే గోపీచంద్ ను దగ్గర్లోని హాస్పిటల్ లో అడ్మిట్ చేశారనీ గోపీచంద్ కు ట్రీట్ మెంట్ అందిస్తున్నారనీ ఆయనకు ప్రమాదం లేదని.. అభిమానులు ఆందోళన చెందొద్దని చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమా చిత్రం ప్రస్తుతం జైపూర్ దగ్గరున్న మాండవలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ రోజుతో అక్కడ చిత్రీకరణ ముగియాల్సి ఉండగా బైక్ చేజింగ్ సీన్స్ తీస్తున్న టైమ్ లోగోపీచంద్ నడుపుతున్న బైక్ స్కిడ్ అయింది. దీంతో ఆయనకు గాయాలయ్యాయి‌. గోపీచంద్ ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని, గాయాలకు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మిగిలిన చిత్రీకరణ చేసుకోవచ్చని అక్కడి హాస్పిటల్స్ డాక్టర్స్ తెలిపారని సమాచారం.