Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ గత నాలుగు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ‘బాహుబలి’ సినిమా ప్రారంభం అయిన్నప్పటి నుండి సినిమాను పూర్తి చేసి ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని, మొదటి పార్ట్ విడుదల అవ్వడమే ఆలస్యం పెళ్లి పీఠలు ఎక్కుందుకు ప్రభాస్ సిద్దంగా ఉన్నాడు అంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. ఇక హీరోయిన్ అనుష్కతో కూడా ప్రభాస్ వివాహం గురించి మీడియాలో ఓ రేంజ్‌లో ప్రచారం జరిగింది. ఇద్దరి మద్య ప్రేమ ఉందనే విషయాన్ని సినీ వర్గాల వారు కొట్టి పారేస్తున్నారు. వారిద్దరు మంచి స్నేహితులు మాత్రమే అంటూ ప్రభాస్ సన్నిహితులు స్వయంగా ప్రకటించారు. భీమవరం అమ్మాయికి ప్రభాస్ ఓకే చెప్పాడు అంటూ కూడా వార్తలు వచ్చాయి.
మీడియాలో తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ప్రభాస్ అసహనం వ్యక్తం చేశాడు. ఆ వార్తు చూస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నాకు నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. నా పెళ్లి గురించిన ముచ్చట్లు నేను అస్సలే పట్టించుకోను. నా పెళ్లి గురించి కుటుంబ సభ్యులు చూసుకుంటారు. నేను పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచించే పరిస్థితిలో లేను. సినిమాలపైనే ఎక్కువ దృష్టి, నేను ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్న విషయం కూడా నేను చెప్పదల్చుకోవడం లేదు. పెళ్లి గురించి నాకు నా కుటుంబ సభ్యులకు ఒక ఐడియా ఉంది, దాన్ని బట్టి మేం ముందుకు సాగుతాం అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు.
బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని ఫ్యాన్స్ కూడా భావించారు. అయితే ‘బాహుబలి’ పూర్తి అయిన వెంటనే ‘సాహో’ చిత్రాన్ని మొదలు పెట్టాడు. సాహో చిత్రం తర్వాత మరో రెండు మూడు చిత్రాలకు కూడా ప్రభాస్ కమిట్ అయ్యాడు. ఆ సినిమాలకు ముందు పెళ్లి చేసుకుంటాడా లేక, ఒప్పుకున్న సినిమాలన్ని పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటాడా అనేది చూడాలి. సుజీత్ దర్శకత్వంలో ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది.