గరుడవేగ చిత్రంతో చాలా కాలం తర్వాత సక్సెస్‌ను దక్కించుకున్న రాజశేఖర్ త్వరలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు. గరుడవేగ సక్సెస్ తర్వాత చేయబోతున్న సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలనే ఉద్దేశ్యంతో రాజశేఖర్ కాస్త ఎక్కువ గ్యాప్‌ను తీసుకున్నాడు. ఎట్టకేలకు ‘అ!’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ప్రశాంత్ దర్శకత్వంలో రాజశేఖర్ ఒక విభిన్న చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు. ప్రస్తుతం ఈయన బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘క్వీన్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. తెలుగులో త్వరలోనే రిలీజ్ కాబోతున్న క్వీన్ రీమేక్ తర్వాత రాజశేఖర్ హీరోగా సినిమాను ప్రశాంత్ మొదలు పెట్టబోతున్నాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న రాజశేఖర్ మూవీకి సంబంధించిన ఒక చిన్న అధికారిక ప్రకటన వచ్చింది. 1980 కాలంలో తెలంగాణలో ఒక చిన్న పల్లె ప్రాంతంలో జరిగిన కథ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఇటీవలే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ‘రంగస్థలం’ చిత్రం వచ్చింది. ఆ చిత్రంను 1980 కాలం నేపథ్యంలో ఆంధ్రాలోని ఒక పల్లెలో చూపించడం జరిగింది. ఇప్పుడు కాస్త అటు ఇటుగా రాజశేఖర్ మూవీ కూడా అలాగే ఉండబోతుంది. రంగస్థలం చిత్రం కోసం మంచి సెట్టింగ్స్‌ను చిత్ర యూనిట్ సభ్యులు నిర్మించారు. రాజశేఖర్ మూవీ కోసం కూడా 1980 కాలం నాటి కొన్ని కట్టడాలను దర్శకుడు సెట్స్ వేయించేందుకు ఆర్ట్‌ు రెడీ చేయిస్తున్నాడు. మొత్తానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ మరో రంగస్థలం చిత్రాన్ని ప్రేక్షకులకు చూపిస్తాడేమో అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.