విలన్‌ పాత్ర కూడా హీరో రేంజ్‌లో ఉండాలా?

hero rajashekar wants stylish characters in villan role also

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

యాంగ్రీ యంగ్‌మన్‌ రాజశేఖర్‌ హీరోగా సక్సెస్‌ కాలేక పోతున్నాడు. ఆయన గత పది సంవత్సరాలుగా సక్సెస్‌లు లేక ఢీలా పడిపోయాడు. ప్రస్తుతం ‘గరుడవేగ’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. అయితే హీరోగా సక్సెస్‌ కాలేక పోయిన వారు విలన్‌గా లేదా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోతున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్‌ వంటి వారు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే రాజశేఖర్‌ మాత్రం విలన్‌ వేశాలు వేయాలంటే కండీషన్స్‌ పెడుతున్నాడు. రామ్‌చరణ్‌ ‘ధృవ’ చిత్రంలో విలన్‌ పాత్రను చేసే అవకాశం మొదట రాజశేఖర్‌కు వచ్చింది. అయితే ఆ సినిమాను కాదన్నాడు. దాంతో అరవింద్‌ స్వామిని ఆ సినిమాలో విలన్‌గా తీసుకున్నారు. తాజాగా బాలకృష్ణ సినిమాను కూడా రాజశేఖర్‌ తిరష్కరించాడు. 

వరుసగా వస్తున్న ఆఫర్లను తిరష్కరిస్తున్న రాజశేఖర్‌ మీడియాతో మాట్లాడుతూ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశాడు. తనకు పలు సినిమాల్లో విలన్‌ పాత్ర లేదా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అవకాశం వచ్చింది. అయితే ఆ పాత్రలు నాకు నచ్చలేదు. నేను ఏదైనా పాత్ర చేయాలి అంటే ఆ పాత్రలో బలం ఉండాలి, నటనకు ఆస్కారం ఉండి ఉండాలి. ఏదో చేశామా అంటే చేశాం అన్నట్లుగా కాకుండా హీరో స్థాయిలో ఆ పాత్ర ఉంటేనే చేస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏదైనా సినిమాలో విలన్‌ పాత్ర హీరో స్థాయిలో ఉంటుందా, ముఖ్యంగా తెలుగు సినిమాల్లో విలన్‌ పాత్ర ఎప్పుడైనా హీరో కంటే కింది స్థాయిలోనే ఉంటుంది. రాజశేఖర్‌  మాత్రం విలన్‌ పాత్ర కూడా హీరో స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాడు. మరి రాజశేఖర్‌కు అలాంటి విలన్‌ పాత్రు ఎవరు ఇస్తారో చూడాలి.

మరిన్ని వార్తలు

శమంతకమణి ప్రివ్యూ.

స్పందించిన వెంకటేష్‌ ఫ్యామిలీ