Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాగార్జున, వర్మల కాంబినేషన్‌లో చాలా సంవత్సరాల తర్వాత తెరకెక్కబోతున్న చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెల్సిందే. లాంచనంగా భారీ అంచనాల నడుమ ప్రారంభం అయిన ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది. రెండవ షెడ్యూల్‌ను వచ్చే నెల చివర్లో ప్రారంభించబోతున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గురించి రకరకాల పుకార్లు మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదని కొందరు ప్రచారం చేస్తుంటే మరి కొందరు అనుష్కను హీరోయిన్‌గా బుక్ చేశారు అంటూ మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్మ ఈ చిత్రంలో హీరోయిన్ విషయమై క్లారిటీ ఇచ్చాడు.
నాగార్జునకు జోడీగా వర్మ ఒక మోడల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయడం జరిగింది. తెలుగు ప్రేక్షకుల ముందుకు కొత్త హీరోయిన్‌ను తీసుకు రాబోతున్నట్లుగా వర్మ అధికారికంగా ప్రకటించాడు. మైరా సరీన్ అనే మోడల్ ఫొటోలను పోస్ట్ చేసి ఈమె నాగార్జునకు జోడీ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ‘శివ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన కారణంగా చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. దాదాపు పది సంవత్సరాలుగా వర్మ పెద్ద సక్సెస్ లేకుండా కెరీర్‌ను నెట్టుకు వస్తున్నాడు. ఇప్పుడు వర్మ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని వర్మ ధీమాగా వ్యక్తం చేస్తున్నాడు.