ఇటీవలి కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీని పట్టి కుదిపేసిన అంశాలు ప్రధానంగా రెండే రెండు. అందులో ఒకటి టాలీవుడ్ డ్రగ్స్ కేసు అయితే మరొకటి, క్యాస్టింగ్ కౌచ్ అంశం. అయితే టాలీవుడ్ లో ఈ డ్రగ్స్ కేసు పెద్దగా ప్రకంపనలు పుట్టించకపోయినా నటి శ్రీ రెడ్డి లేవనెత్తిన ఈ క్యాస్టింగ్ కౌచ్ అంశం మాత్రం చాలా ప్రకంపనలు రేపింది. ఆమెను చూసి మరింత మంది జూనియర్ ఆర్టిస్ట్ లు ముందుకు రావడం, ప్రొడక్షన్ మేనేజర్లు, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ ల పేర్లు బయటకు రావడంతో అప్పుడు ప్రతి రోజు ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో అన్ని టెన్షన్ టెన్షన్ వాతావరణం నడించింది. ఆ తర్వాత రోజుల్లో శ్రీ రెడ్డి చెన్నై కు మకాం మార్చడం తెలుగు వారి మీద ఫోకస్ తగ్గించడంతో కాస్త ఒప్పిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది.
ఈ తరుణంలో ఫెడ్ అవుట్ అయిపోయిన ఒకప్పటి హీరోయిన్ తనుశ్రీ దత్తా ఇప్పుడు చేస్తున్న ఈ లైంగిక వేధింపుల కామెంట్లు మళ్ళీ వేడిని రాజేసాయి. ఏకంగా బాలీవుడ్ లో కాస్త మాస్ ఫాలోయింగ్ ఉన్న నానా పటేకర్ ను టార్గెట్ చేయడంతో అది తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఆమెను ఎంతో మంది సపోర్ట్ చేసారు కూడా, ఇప్పుడు ఆమె బాటలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా తనను క్వీన్ దర్శకుడు వేధించాడని, సింగర్ చిన్మయి ఏమో తనకు చిన్నప్పటి నుండి ఎదురయిన ఈ వేధింపులు అన్నీ చెప్పుకొచ్చింది. అంటే ఒక రకంగా చూస్తే ఈ నటీమణులు చేస్తున్న ఆరోపణలు అన్నీ నిరాధరమైనవే, అవి నిజంగానే జరిగి ఉండచ్చుగాక కానీ ఇప్పుడు అవి బయట పెట్టినా వాటిని సమర్ధించుకోడానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సిద్దంగా ఉన్నారు. దీంతో వారు చేస్తున్న ఆరోపణలు కేవలం మీడియా స్టంట్ లు గా మారుతున్నాయే తప్ప నిజంగా న్యాయం కోసమో, ఇప్పటి ఆడపిల్లల, సినీ రంగంలో ఎదుగుతున్న వారికీ గుణపాటంగానో ఉండడం లేదన్నది బహిరంగ రహస్యమే.