Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సిట్ వాళ్లు నోటీసులిచ్చారని మీడియాలో ప్రచారం జరిగినందుకే సెలబ్రిటీలు తెగ బాథపడిపోతున్నారు. కానీ ఛార్మి మాత్రం హైకోర్టులో పిటిషన్ వేసి మరింత హైప్ తెచ్చుకుంది. పూరీ జగన్నాథ్ లాంటి వాళ్లు కూడా నోరు కట్టేసుకుని సిట్ ముందుకు వచ్చి వెళితే.. ఛార్మి మాత్రం ఎంక్వైరీ తీరునే తప్పుబట్టి కలకలం రేపింది. కానీ హైకోర్టు మాత్రం ఛార్మికి ఊరట ఏమీ ఇవ్వలేదు.
ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకే విచారించారని, మహిళా అదికారులు ఉండాలని, ఇష్టపూర్వకంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలని, లాయర్ సమక్షంలో విచారించాలని హైకోర్టుకు వెళ్లారు ఛార్మి. అయితే కోర్టు మూడు డిమాండ్లకు అంగీకరించి నాలుగో డిమాండ్ కు నో చెప్పింది. కోర్టు అంగీకరించిన మూడు డిమాండ్లకు సిట్ ఎప్పుడో ఓకే చెప్పేసింది.
హైకోర్టు కేసుతో మొత్తం మీద ఛార్మికి ఒరిగిందేమీ లేకపోగా.. అసలు ఎందుకు కోర్టుకెళ్లారనే వాదన తెరపైకి వచ్చింది. మహిళా అధికారుల్ని సిట్ అరేంజ్ చేస్తామంది. విచారణకు సహకరిస్తే త్వరగా అయిపోతుందని శ్యాం కే నాయుడు ఎగ్జాంపుల్ ఉండనే ఉంది. ఇక బ్లడ్ శాంపిల్స్ నవదీప్ ఇవ్వనన్నాడు కాబట్టి తీసుకోలేదు. ఇలా అన్నింటికీ సిట్టే ఒప్పుకుంటే.. ఆ మాత్రం దానికి కేసెందుకని సినీ పెద్దలు ఛార్మిక తలంటారట.
మరిన్ని వార్తలు: