గత అయిదు సంవత్సరాల్లో సినిమా టికెట్ల ధరలు 50 నుండి 150 శాతం వరకు పెరిగాయి. అయినా కూడా నిర్మాతలు టికెట్ల రేట్లు పెంచాలని భావిస్తున్నారు. అందుకు ప్రభుత్వం నో చెప్పడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సినిమా నిర్మాతల వాదనలు విన్న హైకోర్టు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతించింది. ప్రభుత్వం అందుకు ఓకే చెప్పాల్సిందిగా హైకోర్టు సూచించింది. సినిమాల టికెట్ల రేట్లు పెంపు విషయమై ప్రభుత్వాలు అలసత్వం చూపుతున్నాయంటూ నిర్మాతల తరపు న్యాయమూర్తి వాదించారు. నిర్మాతల వాదనతో అంగీకరించిన కోర్టు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు వీలుగా మద్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ విషయమై ఇంకా వాదనలు వినాల్సి ఉందని, ప్రభుత్వం తమ వాదనలను వినిపించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
ఇప్పటికే కోర్టు టికెట్ల రేట్లు ఆకాశంలో ఉన్నాయి. కొన్ని సంవత్సరాల వరకు బాల్కనీ టికెటు ధర 40 నుండి 60 వరకు ఉండేది. కాని ఇప్పుడు 80 నుండి 150 వరకు ఉంది. ఇంకా పెంచేందుకు అనుమతి ఇవ్వడంతో 100 రూపాయలకు పైగా పెరిగే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఫ్యామిలీతో సినిమాకు వెళ్లాలి అంటే వేయి రూపాయలు చేతులో పట్టుకోవాల్సిన పరిస్థితి. టికెట్ల రేట్లు పెంచితే పైరసీని ఎక్కువ మంది ప్రేక్షకులు ఆశ్రయించే అవకాశం ఉందని, ప్రస్తుతం ఉన్న టికెట్ల రేట్లను తగ్గించాలని కొందరు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక కోర్టు ఆదేశాలతో నిర్మాతల్లో మరియు థియేటర్ యాజమాన్యం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.