హానీ ప్రీత్ కూడా రేప్ కేస్ బాధితురాలే ?

HoneyPreet rape case victim

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రేప్ కేసులో డేరా బాబాకి 20 ఏళ్ల జైలు శిక్ష పడగానే దేశమంతా ఆయన గురించి చర్చ సాగుతోంది. డేరాలో గుర్మీత్ చేసిన అక్రమాలు,అకృత్యాలు ఒక్కోటిగా బయటపడుతున్నాయి. ఆయన చేతిలో ఎంతోమంది మహిళలు రేప్ కి గురి అయినట్టు కూడా ప్రపంచానికి అర్ధం అవుతోంది. అలాంటి మహిళల పట్ల అంతా సానుభూతి చూపిస్తున్నారు. అదే సమయంలో హానీ ప్రీత్ అనే మహిళని దోషిగా చూస్తున్నారు. ఆమె మీద వున్న ప్రధాన ఆరోపణ ఏమిటంటే …గుర్మీత్ కి శిక్ష పడ్డాక హింస చెలరేగడానికి హానీ ప్రీత్ రెచ్చగొట్టే చర్యలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇది చట్టపరంగా వున్న ఆరోపణ అయితే … ఆమె కి డేరా బాబాతో అక్రమ సంబంధం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే ఆరోపణతో ఆమె నుంచి విడాకులు తీసుకున్న భర్త విశ్వాస్ గుప్త కూడా బయటికి వచ్చి ఇదే వాదన వినిపిస్తున్నారు. తాజాగా ఆమెకి సంబంధించి ఇంకో విషయం కూడా ప్రచారంలోకి వచ్చింది.

మొత్తం గుర్మీత్ సామ్రాజ్యాన్ని తన గుప్పిట్లో వుంచుకోడానికి హానీ ప్రీత్ గట్టి ప్రయత్నం చేశారని అంటున్నారు. అందులో భాగంగా ఆమె డేరా బాబాతో సంతానం కని, విశ్వాస్ గుప్తా బిడ్డగా ప్రపంచానికి చూపి ఆ బిడ్డని గుర్మీత్ వారసుడిగా నిలపాలని భావించారట. ఈ విషయమే ఇప్పుడు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. ఈ విషయాలు బయటపెట్టిన వ్యక్తే ఇంకో విషయం కూడా బయటపెట్టారు. హానీ ప్రీత్ సైతం తొలుత డేరాబాబా చేతిలో రేప్ కి గురి అయ్యారంట. ఆ విషయాన్ని హానీ ప్రీత్ బయటపెట్టలేకపోయారట. కాలం గడిచే కొద్దీ ఆమె అతనితో సన్నిహితంగా మెలిగి మొత్తం డేరా ని తన కనుసన్నల్లో నడిచేలా చేసుకోగలిగింది. చివరకు మొత్తం డేరా ని శాసించే బాబాని కూడా ఎంతోకొంత తన దారిలోకి తెచ్చుకుంది.

ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే హానీ ప్రీత్ లో నెగటివ్ కోణాల్ని మాత్రమే ఎక్కువగా చూపేందుకు ప్రయత్నం చేస్తోంది. ఆమె కూడా ఒకప్పుడు రేప్ బాధితురాలు అనే విషయాన్ని పట్టించుకోవడంలేదు. పైగా ఆ రేప్ కి పాల్పడ్డవాడిని తన చుట్టూ తిరిగేలా చేసుకోగలిగింది. ఓ విధంగా గుర్మీత్ ని కొద్ది స్థాయిలో అయినా కంట్రోల్ చేయగలిగింది. రేప్ కి గురి అయ్యింది కాబట్టి ఆ తర్వాత ఆమె చేసింది అంతా కరెక్ట్ అని చెప్పడం మా ఉద్దేశం కాదు. కానీ ఓ మహిళ ఇలా మారడానికి మూలం తనపై రేప్ జరగడం అన్న విషయాన్ని మీడియా కానీ, ఇతర బాధితులు కానీ కన్వెనియెంట్ గా మర్చిపోవడం మాత్రం కరెక్ట్ కాకపోవచ్చు.