నేను ఏ వేడుక‌కి హాజ‌రు కావ‌డం లేదు: రాజ‌మౌళి

i am not attending any function

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉండ‌గా, ఓ వారం పాటు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. ఈ లోపు పర్స‌న‌ల్ వ‌ర్క్ కోసమ‌ని అమెరికాకి వెళ్ళారు. అయితే రాజ‌మౌళి అమెరికా వెళ్ళారని తెలుసుకున్న అభిమానులు ఆయ‌న తానా వేడుక‌ల‌లో పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి తన ట్విట్ట‌ర్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చారు. నా వ్య‌క్తిగ‌త ప‌నిపై వాషింగ్ట‌న్‌కి వ‌చ్చాను. తానా వేడుక‌ల కోసం కాదు. నా పెద్ద‌న్న మ్యూజిక‌ల్ కార్య‌క్ర‌మంకి కూడా నేను హాజ‌రు కావ‌డం లేదు. నేను వ‌స్తాన‌ని ఆశించి ఒక‌వేళ రాక‌పోతే బాధ‌ప‌డే నా అభిమానుల కోసం ఈ క్లారిటీ ఇస్తున్న‌ట్టు జ‌క్క‌న్న త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం జూలై 30, 2020లో విడుద‌ల కానుంది.