తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరి దగ్గరకైనా వెళ్తా.. ఎన్ని పర్యటనలైనా చేస్తానంటున్న సీఎం రేవంత్.. ఇప్పుడు మరో టూర్ ఫిక్స్ చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కోసం ఏప్రిల్ 15 రాత్రి బెంగుళూరు ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం ఆయనతో కలిసి వెళ్లారు.





