వాట్ ఈజ్ దిస్ అని జగన్ ని ఆడుకున్న ఐఏఎస్ ఎంపీ కాబోతున్నారా ?

ratna prabha joins bjp

రత్నప్రభ…ఈ పేరు దక్షిణాది రాష్ట్రాల పాలనా వ్యవహారాల్లో ఏ కాస్త పరిచయం వున్న వారికైనా కొట్టిన పిండి. ఆంధ్రప్రదేశ్ కి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి చంద్రయ్య కుమార్తెగానే మిగిలిపోకుండా ఐఏఎస్ సాధించి కర్ణాటక క్యాడర్ లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు ఆమె. ఓ దశలో డెప్యూటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ లో ఐటీ సెక్రటరీ గా పని చేశారు. సీఎం రాజశేఖర్ రెడ్డి వున్నప్పుడు సొంత రాష్ట్రంలో పని చేయడాన్ని ఆమె ఎంతగా ఎంజాయ్ చేశారో అంతగానూ ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇందు టెక్ కి భూముల కేటాయింపు కేసులో ఆమె విచారణ ఎదుర్కొన్నారు. వై.ఎస్ మరణం తర్వాత అదే కేసుకి సంబంధించి కోర్టుకి వచ్చిన ఓ సందర్భంలో ఆమె వైసీపీ అధినేత జగన్ ని నేరుగానే దుమ్ము దులిపారు. వాట్ ఈజ్ దిస్ జగన్ ? మీరు చేసిన తప్పులకి మేము కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తోంది అంటూ మొహం మీదే అడిగేసారు. ఆపై కోర్టు నుంచి ఆమెకు ఆ కేసు నుంచి రిలీఫ్ వచ్చిందనుకోండి. ఆపై తిరిగి కర్ణాటకలో కీలక బాధ్యతలు చూసిన ఆమె సీఎస్ గా పని చేసి రిటైర్ అయ్యారు.

jagan

ఆ రత్న ప్రభ ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నారా ? ఎంపీ కాబోతున్నారా ? …ఎస్..ఆ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. బీజేపీ ఆమెని రాజకీయాల్లోకి తీసుకురావాలని గట్టిగా ప్రయత్నం చేస్తోంది. లోక్ సభలో కమలనాధుల్ని గట్టిగా ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ని కర్ణాటకలో గెలవకుండా చేయాలని మోడీ , అమిత్ షా భావిస్తున్నారు. ఖర్గే మీద గెలవాలంటే కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలని చూస్తున్న బీజేపీ కి రత్నప్రభ ఓ ఛాయస్ గా కనిపించారు. ఇప్పటికే ఆమెతో కమలం పార్టీ నేతలు ఒకటి రెండు సమావేశాలు పూర్తి చేశారు. ఈ వ్యవహారం అంతా చూస్తున్న వైసీపీ నేతలకు ఎక్కడో ఏదో అవుతోంది. కర్ణాటక రాజకీయాలతో సంబంధం లేకపోయినా జగన్ ని నిలదీసిన వ్యక్తికి బీజేపీ అంత ప్రాధాన్యం ఇవ్వడం వైసీపీ కి ఎలా రుచిస్తుంది పాపం !

jagan